రేపు అన్నదాతల ‘రైల్ రోకో’ ఆందోళన, నాలుగు గంటలపాటు రైళ్లను నిలిపేస్తాం, రైతునేత రాకేష్ తికాయత్

దేశవ్యాప్తంగా తాము గురువారం 'రైల్ రోకో' ఆందోళన నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు

రేపు అన్నదాతల 'రైల్ రోకో' ఆందోళన, నాలుగు గంటలపాటు రైళ్లను నిలిపేస్తాం, రైతునేత రాకేష్ తికాయత్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2021 | 6:05 PM

దేశవ్యాప్తంగా తాము గురువారం ‘రైల్ రోకో’ ఆందోళన నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ ఆందోళన జరుగుతుందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న తమ ఆందోళనను వివిధ రూపాలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం అనేక ఆంక్షలను తొలగించిందని, కానీ గత 8 నెలలుగా పలు రైలు సర్వీసులను మాత్రం అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ  రైల్ రోకో ఆందోళనలో తమతమ గ్రామాలనుంచి అనేకమంది అన్నదాతలు పాల్గొంటారని తికాయత్ చెప్పారు. తమ అనుబంధ సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిరసనకు పిలుపునిచ్చిందన్నారు.

రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 20 కంపెనీల అదనపు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమిస్తోంది. . ముఖ్యంగా పంజాబ్, హర్యానా, బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై తాము ఫోకస్ పెట్టినట్టు ఈ శాఖ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని, ఈ ఆందోళన శాంతియుతంగా సాగాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా తికాయత్ తమ మహా పంచాయత్ ల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. సుమారు పది రోజులపాటు ఆయన మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి అన్నదాతలను సమీకరించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. రైతు చట్టాలపై దేశ వ్యాప్తంగా అన్నదాతలను చైతన్య పరచడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో జర్నలిస్ట్ ప్రియా రమణి నిర్దోషి, ఢిల్లీ కోర్టు తీర్పు