నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో అతని భార్య, అత్త పైన ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ఆత్మహత్య చేసుకునేలా వీరు  అతడిని ప్రేరేపించారని  కేసు పెట్టారు.

  • Umakanth Rao
  • Publish Date - 4:33 pm, Wed, 17 February 21
నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో అతని భార్య, అత్త పైన ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ఆత్మహత్య చేసుకునేలా వీరు  అతడిని ప్రేరేపించారని  కేసు పెట్టారు. ముంబైలోని తన ఇంట్లో సందీప్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆయనను వెంటనే గోరేగావ్ లోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు  ప్రకటించారు. ఇతని భార్య, అత్తా మామలు, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. తన ఆత్మహత్యకు ముందు సందీప్ సూసైడ్ నోట్ పేరిట  ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు. అందులో తన కాపురం సవ్యంగా సాగలేదని, ఈ జీవితం తనకు నరకప్రాయమైందని పేర్కొన్నాడు. ప్రతి రోజూ తన భార్య కాంచన శర్మ తనను వేధిస్తుందని, తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని, ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరిస్తుంటారని తెలిపాడు.

ఎం ఎస్ ధోనీ, అన్ టోల్డ్ స్టోరీ, కేసరి వంటి చిత్రాల్లో సందీప్ నహర్ నటించాడు. ఎం ఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ తో కలిసి యాక్ట్ చేశాడు. కేసరి సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని చదవండి ఇక్కడ :

Bull punished young men Viral Video :కాపాడిన కుర్రాళ్లుపై తిరగబడ్డ ఎద్దు ..! వైరల్ అవుతున్న వీడియో

Nagarjuna New Movie Photos: కొత్త సినిమా షూరు చేసిన కింగ్ నాగార్జున ఈ సారి ‘గరుడవేగ’ డైరెక్టర్‏తో..