Green Chilli Chai : కారం కారంగా పచ్చిమిర్చి తో టేస్టీ ‘టీ’ .. ఈ చిల్లీ ఛాయ్ కోసం కస్టమర్స్ క్యూ

టీ, కాఫీ అలవాట్లు మనవి కాకపోయినా అవి మన జీవితంలో ఒక భాగమయ్యాయి. అసలు 'టీ' తాగకపోతే మెదడు పనిచేయదండి.. 'టీ' లేకపోతె బద్ధకం వదలదు.. నిద్ర రాకుండా చేయాలంటే ఒక్క "టీ" పడాల్సిందే ' ఇలా టీ తాగే ప్రియుల కోసం... తాజాగా ఓ కెపే పచ్చి మిర్చితో టీ తయారు..

Green Chilli Chai :  కారం కారంగా పచ్చిమిర్చి తో టేస్టీ 'టీ' .. ఈ చిల్లీ ఛాయ్ కోసం కస్టమర్స్ క్యూ
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2021 | 4:14 PM

Green Chilli Chai : టీ, కాఫీ అలవాట్లు మనవి కాకపోయినా అవి మన జీవితంలో ఒక భాగమయ్యాయి. అసలు ‘టీ’ తాగకపోతే మెదడు పనిచేయదండి.. ‘టీ’ లేకపోతె బద్ధకం వదలదు.. నిద్ర రాకుండా చేయాలంటే ఒక్క “టీ” పడాల్సిందే ‘ ఇలా టీ తాగే ప్రియులు చెప్పే మాటలను సర్వసాధారణంగా వింటూనే ఉంటాం..అయితే బ్రిటిష్ వారు మనకు వదిలిన ‘టీ’ అల్లం టీ , మసాలా టీ , లెమన్ టీ, బాదం టీ, గ్రీన్ టీ ఇలా అనేక రూపాలను సంతరించుకుంది. అయితే తాజాగా చిల్లీ సాస్ లా చిల్లీ టీ గా కూడా అభిమానులను అలరిస్తోంది. ఈ చిల్లీ టీ కోసం కస్టమర్లు ఆ షాప్ క్యూ లో నిలిచుంటారు అంటే అతిశయోక్తి కాదు వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక లోని ప్రముఖ నగరం బెంగళూరులోని జేపీ నగర్ లో ఓ కెఫే ఎప్పుడూ కస్టమర్లతో కిక్కిసిరి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొరికే చిల్లీ చాయ్ కోసం కస్టమర్స్ క్యూలో నిల్చుంటారట.. ఈ కెఫే లో పచ్చి మిర్చితో ప్రత్యేకంగా ఓ వెరైటీ టీ ని తయారు చేస్తారు. ఈ చిల్లీ ఛాయ్‌కి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

లోకో భిన్న రుచి అన్నారు పెద్దలు.. కొంతమంది ఎప్పుడూ ఒకటేనా.. కొత్తగా ఉంటె బాగుండును తినడానికి అనుకున్నారు.. డిఫరెంట్ రుచులను ఆస్వాదించాలని భావిస్తారు..అటువంటి వారికోసమే ఈ చిల్లీ చాయ్ ను తయారు చేశామని కెఫే నిర్వాహకులు చెప్పారు. ఇక ఈ కెఫె ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతుంది.. ముఖ్యంగా చిల్లీ చాయ్ కోసమే వినియోగదారులు వస్తాయని యజమాని తెలిపారు.పచ్చిమిర్చి తో చేసిన టీ .. కారం కారంగా తీపిగా.. వేడిగా ఉంటూ డిఫరెంట్ ఫీలింగ్ ని ఇస్తుందని తగినవారు చెబుతుంటారు. అందుకనే ఈ కొత్త టీ మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. తగినవారు సోషల్ మీడియాలో చిల్లీ చాయ్ గురించి చెప్పడంతో రోజు రోజుకీ ప్రజలకు తెలుస్తోంది.

టీ తయారీ విధానం గురించి కూడా ఆరాతీస్తున్నారు. టీ పొడి, పాలు , చక్కర తోపాటు తాజా పచ్చి మిర్చి ముక్కలను కలిపి ఈ చిల్లీ చాయ్ ను తయారు చేస్తారట.. అంతేకాదు ఈ టీ ని మట్టి కప్పుల్లో అందించడంతో మరింత రుచి లభిస్తుందని నిర్వాహకులు చెప్పారు.

నిజానికి ఈ కెఫే ఇప్పటికే పలు రకాలా టీ ప్లేవర్స్ ను తయారు చేసింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా లభించే మొరాకన్ మింట్, కాశ్మీరీ కాహ్వా, ఓరియంటల్ జింజర్ టి తో పాటు దేశీయ ప్రసిద్ధి ఫ్లేవర్ టీలను కూడా అందిస్తుంది. ఇక ఇప్పుడు చిల్లీ చాయ్ ను తయారు చేసి అందరి చూపు ఒక్కసారి మళ్ళీ తనవైపు తిప్పుకుంది కేపే. ఈ చాయ్ తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వంటి వాటికీ ఉపశమనం కూడా లభిస్తుందని తయారీదారులు చెబుతున్నారు.

Also Read:

 తొక్కేకదా అని తీసి పడేయకండి.. అరటిపండు తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ఇందులో పెట్టుబడి పెడితే సేఫ్ అండ్ సెక్యూర్.. లక్షకు ఐదు లక్షలు లాభం. వివరాలు ఇవే..!