Banana Peel Benefits: తొక్కేకదా అని తీసి పడేయకండి.. అరటిపండు తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

తక్కువ ధరకే అందుబాటులో ఉండే అరటి పండు. దీనిని క్రీడాకారులు, అధికంగా శ్రమించేవారు కచ్చితంగా తింటారు. ఎందుకంటే ఈ పండులో పోషకాలు మెండు. అయితే పండు తినేసి.. తొక్కను పడేస్తుంటాం.. అయితే...

Banana Peel Benefits: తొక్కేకదా అని తీసి పడేయకండి.. అరటిపండు తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2021 | 4:14 PM

Banana Peel Benefits:తక్కువ ధరకే అందుబాటులో ఉండే అరటి పండు. దీనిని క్రీడాకారులు, అధికంగా శ్రమించేవారు కచ్చితంగా తింటారు. ఎందుకంటే ఈ పండులో పోషకాలు మెండు. అయితే పండు తినేసి.. తొక్కను పడేస్తుంటాం.. అయితే అర‌టిపండే కాదు దాని తొక్క‌తో కూడా అనేక ప్రయోజనాలున్నాయి.. అవి ఏంటో తెలుసుకుందాం..! ‌

* దంతాల సంరక్షణే కాదు.. పళ్ళు మిలమిలా మెరవాలన్నా అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే పళ్ళు తెల్ల‌గా మెరుస్తాయి.

* యాంటీ ఏజింగ్ గుణాలు అరటి పండు తొక్క‌లో ఉన్నాయి.కనుక ఈ తొక్కను చర్మంపై ముడతలు ఏర్పడే భాగంలో అప్లై చేస్తే వృద్ధ్యాప్యం తో వ‌చ్చే ముడ‌త‌లు తగ్గుతాయి. అంతేకాదు చ‌ర్మం కాంతి వంత‌మ‌వుతుంది.

* చర్మంపై దురద, దద్దుర్లు ఏర్పడితే.. అరటిపండు తొక్కతో రుద్దితే సమస్య తగ్గుతుంది.

* అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. కళ్లపై అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచి అనంతరం దానితో కళ్ళపై సున్నితంగా మర్దనా చేస్తే కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.

* ముఖ వర్చస్సు పెంచుకోవడానికి కూడా ఈ తొక్క ఉపయోగపడుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. దీంతో పైన చెప్పిన చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం ఆరోగ్యాన్ని సంత‌రించుకుంటుంది.

* శ‌రీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్క‌డ అర‌టి పండు తొక్కతో కొంచెం సేపు మసాజ్ చేసినల్టు రుద్దాలి. ఇలా చేస్తే నొప్పి నుంచి కొంచెం సేపటికే రిలీఫ్ వస్తుంది.

* పురుగులు, కీట‌కాలు కుట్టినచోట వెంటనే అర‌టి పండు తొక్క‌ను రాస్తే… ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

* కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్క ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి.

* ఇక వస్తువులను కూడా అరటిపండు తొక్కతో శుభ్రం చేసుకోవచ్చు..

* వెండి , స్టీల్ వస్తువులపై మరకలు పోవడానికి, డిష్ వాషర్ సోప్ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి.

* నాస్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్ త్వరగా పోదు

*అరటిపండు తొక్కతో సేంద్రీయ పోషకాలు ఉంటాయి కనుక తొక్కను మొక్కలకు వేస్తె మంచి ఎరువుల ఉపయోగపడుతుంది.

*కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్ తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి.

Also Read:

: కొబ్బరి నూనేతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారంట ? అదేలాగో తెలుసుకుందామా..

ఇందులో పెట్టుబడి పెడితే సేఫ్ అండ్ సెక్యూర్.. లక్షకు ఐదు లక్షలు లాభం. వివరాలు ఇవే..!