ELSS Funds : ఇందులో పెట్టుబడి పెడితే సేఫ్ అండ్ సెక్యూర్.. లక్షకు ఐదు లక్షలు లాభం. వివరాలు ఇవే..!

ఎవరైనా తమ వద్ద ఉన్న డబ్బులను సురక్షితంగా ఉండే దానిలో పెట్టుబడిగా పెట్టాలని రాబడి పొందాలని కోరుకుంటారు. అటువంటి వారికోసమే ఉంది.. . ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈ ఈఎల్ఎస్ఎస్  గురించి తెలిసిన కొంతమంది...

ELSS Funds : ఇందులో పెట్టుబడి పెడితే సేఫ్ అండ్ సెక్యూర్.. లక్షకు ఐదు లక్షలు లాభం. వివరాలు ఇవే..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2021 | 7:27 PM

ELSS Funds: ఎవరైనా తమ వద్ద ఉన్న డబ్బులను సురక్షితంగా ఉండే దానిలో పెట్టుబడిగా పెట్టాలని రాబడి పొందాలని కోరుకుంటారు. అటువంటి వారికోసమే ఉంది.. . ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈ ఈఎల్ఎస్ఎస్  గురించి తెలిసిన కొంతమంది ఇందులో డబ్బులు పెట్టి.. సూపర్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే మీరు కూడా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఎంత డబ్బులు పెడితే.. పన్ను ఆదాతో పాటు.. లాభం కూడా వస్తుంది.. ఆ వివరాలను తెలుసుకుందాం..!

ఈఎల్ఎస్ఎస్‌లో ఎవరైనా డబ్బులు పెట్టుబడి పెడితే.. ప్రతి ఏడాది రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. ఈఎల్ఎస్ఎస్ పదేళ్ల సగటు రాబడి 13 శాతానికి పైగానే ఉంది. ఇక యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పదేళ్ల రాబడి 18.64 శాతంగా ఉంది. మీరు రూ.లక్ష కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.5.5 లక్షలు అయ్యి ఉండేది.

మరోవైపు ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ కూడా పెట్టుబడిదారులకు 15.6 శాతం రాబడి అందించింది. అంటే ఇందులో ఎవరైనా రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ.4.2 లక్షలు వచ్చేవి. ఇది ఇలా ఉండగా డీఎస్‌పీ ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా పదేళ్లలో 15.43 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. దీనితో మీరు రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.2 లక్షలు వచ్చేవి. అలానే బీఎన్‌పీ పారిబాస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రాబడి 15.28 శాతం పైనే ఉంది కనుక రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.15 లక్షలు వస్తుంది. ఇక ఐడీఎఫ్‌సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా మంచి లాభాలను అందించింది. ఇది 15.05 శాతం రాబడి అందించింది. దీనిలో మీరు రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.06 లక్షలు వచ్చేవి. కనుక ఈక్విటీల్లో మదుపు చేయాలి.. అదనపు ప్రయోజనంగా పన్ను అదా ఉండాలి.. అనుకునేవారు ఈఎల్‌ఎస్‌ఎస్‌లను ఎంచుకోవాలని మార్కెట్ నిపుణులు చెప్పారు.

Also Read: