రాజకీయ నాయకులు, సినిమా హీరోల ఛాలెంజ్‌లే కాదు.. ఈ అమ్మాయి ఛాలెంజ్ కూడా స్వీకరించండి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రం ద్వారాకనగర్ లో నివాసముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కు 13 సంవత్సరాల వయస్సున్న కూతురు ఉంది. ఆమె పేరు జ్యోషిక.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రం ద్వారాకనగర్ లో నివాసముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కు 13 సంవత్సరాల వయస్సున్న కూతురు ఉంది. ఆమె పేరు జ్యోషిక. అయితే ఈ అమ్మాయి తన పుట్టినరోజున దుబార ఖర్చు చేయకుండా బోజన్నపేట గ్రామంలో కాలు కోల్పోయి బాధ పడుతున్న, మల్లారపు మల్లయ్య ఇంటికి వెళ్ళి 3500/- రూపాయలు మెడికల్ ఖర్చుల కొరకు అందించింది . ఈ క్రమంలోనే…జ్యోషిక తన మనసులో మాట బయటపెట్టింది. సిస్టర్స్ & బ్రదర్స్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నానంటూ సవాల్ చేసింది.
“రాజకీయ నాయకులు, సినిమా హీరోల ఛాలెంజ్‌లే కాకుండా నా ఛాలెంజ్ కూడా స్వీకరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీ పుట్టినరోజు రోజున పార్టీలు అంటూ ఖర్చు పెట్టె డబ్బులు నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నాను. పంచితే కలిగేది పుణ్యము, ఖర్చుచేస్తే వచ్చేది ఆనందము. ఇది ఒక్క రోజులో పోతుంది. అందుకే మానవత్వంతో ఆలోచించండి”
చిన్నారి జ్యోషిక విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. మరి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఎందరికి ఉందో వేచి చూడాలి మరి!!.
Also Read:
కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..
రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు
Viral News: “మూడేళ్లకే దున్నేస్తున్నాడు”.. నెట్టింట వైరల్‌గా మారిన బుడ్డోడి వీడియో