Kurnool Road Accident: కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది స్పాట్‌లో మృతి చెందారు...
Kurnool Road Accident: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది స్పాట్‌లో మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతా ఒకరికొకరు బంధువులు కాగా.. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట, బాలాజీ నగర్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో తల్లి నజీరా బీ (66), ఆమె కొడుకులు రఫీ (48), దస్తగిరి (50), జాఫర్ వలీ (38), కుమార్తె రోషియా (35), కోడల్లు అమ్మా జాన్ (46), నౌజియా(34), రోషిణి(25), మనవడు అయాన్ (1), మనవరాలు సమీరా (15), రఫీ అత్త అమీర్ జాన్ (63), డ్రైవర్ షఫీ (30), మెకానిక్ షఫీ (38) కన్నుమూశారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు.
ఇక, మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. టెంపో కండీషన్ బానే ఉందని, వ్యాలిడిటీ కూడా ఉందని, అందులో నిబంధనలకు మించి ప్రయాణీకులు కూడా లేరని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. చోటువెల్దుర్తి మండలం మాదాపురం దగ్గరకు చేరుకునేసరికి టెంపో వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో డివైడర్ దాటి అవతలివైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆస్మా, యాస్మిన్, కాశీం(10), ముస్తాక్ (12)లకు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెబతున్నారు. ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో డెడ్‌బాడీలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
Also Read:
‘పద్మశ్రీ’ జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన బహుకళా కోవిదుడు
విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు…
Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’