విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు…

తమిళనాడు తంజావూర్​లో విషాద ఘటన చోటుచేసుకుంాది.  ఓ కోతి అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లింది. స్థానిక హనుమాన్ టెంపుల్​ దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పును పగలగొట్టిన కోతి..

విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు...
Ram Naramaneni

|

Feb 13, 2021 | 9:44 PM

తమిళనాడు తంజావూర్​లో విషాద ఘటన చోటుచేసుకుంది.  ఓ కోతి అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లింది. స్థానిక హనుమాన్ టెంపుల్​ దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పును పగలగొట్టిన కోతి.. లోపలకి ప్రవేశించి ఇద్దరు పసికందుల్ని ఎత్తుకెళ్లింది. ఒక చిన్నారిని గ్రామస్థులు కాపాడగా.. మరో చిన్నారి శవం చెరువులో దొరికింది.

అసలేం జరిగిందంటే..?

వివరాల్లోకి వెళ్తే..  తమిళనాడు తంజావూర్ హనుమాన్​ గుడి దగ్గర్లో​ రాజా, భువనేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. రాజా పెయింటింగ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత వారం భువనేశ్వరి కవలలకు జన్మనిచ్చింది. అయితే.. శనివారం (ఫిబ్రవరి 13).. పిల్లల్ని ఇంట్లో ఉంచి భువనేశ్వరి బయట పని చేసుకుంటుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కోతి వచ్చి ఇంటి పైకప్పు పగులగొట్టి.. లోనికి ప్రవేశించింది. మొదట ఓ చిన్నారిని తీసుకెళ్లి గోడపైన ఉంచింది. మళ్లీ వచ్చి రెండో చిన్నారిని తీసుకెళ్తుండగా భువనేశ్వరి చూసి.. గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని వానరం  దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని.. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read:

Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu