పశ్చిమ బెంగాల్ లో అధికారం మాదే, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, వారికి సింగిల్ డిజిటే
పశ్చిమ బెంగాల్ లో అధికార పగ్గాలు తమ పార్టీకే లభిస్తాయని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము 250 సీట్లు గెలుచుకుంటామని,
పశ్చిమ బెంగాల్ లో అధికార పగ్గాలు తమ పార్టీకే లభిస్తాయని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము 250 సీట్లు గెలుచుకుంటామని, బీజేపీ కి కనీసం రెండు డిజిట్ల మార్క్ కూడా రాదన్నారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా లోని కుల్ఫీ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. బీజేపీ కలలు కల్లలే అవుతాయన్నారు. సీఎం మమతా బెనర్జీ సింగిల్ ఇంజన్ పవర్ ముందు బీజేపీ డబుల్ ఇంజన్ ప్లాట్ కావడం ఖాయమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. 294 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో తాము 200 సీట్లు గెలుస్తామని బీజేపీ చేసిన ప్రకటనను ఆయన అపహాస్యం చేశారు. (సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో అదేపనిగా విమర్శిస్తున్న సంగతి విదితమే). కాగా మూడో సారి కూడా మమత ముఖ్యమంత్రి కావడం ఖాయమని అభిషేక్ బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దే ఈ సారీ అని ఆయన వ్యాఖ్యానించారు.
జై శ్రీరామ్ నినాదాన్ని ప్రస్తావిస్తూ…. మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో భారతీయ జనతా పార్టీకి తెలియదని, అసలు జై సియా రామ్ అన్నది ప్రధాన నినాదమని ఆయన చెప్పారు. హిందీలో దీని అర్థం అటు శ్రీరామునికి, సీతకు కూడా ఉద్దేశించిందని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం రామునికి మాత్రమే ఉద్దేశించినదని అన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: ‘మాతా పిత పూజా దినోత్సవం’గా వేలంటైన్స్ డే, శ్రీరామ్ సేన నినాదం, పబ్ లు, పార్కులపై నిఘా
మరిన్ని చదవండి ఇక్కడ: ‘వ్యవసాయం భారత మాతదే, పారిశ్రామికవేత్తలది కాదు’, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ