‘వ్యవసాయం భారత మాతదే, పారిశ్రామికవేత్తలది కాదు’, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ఈ దేశంలో వ్యవసాయ రంగం భారత మాతదేనని, పారిశ్రామికవేత్తలది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ తన ఇద్దరు సన్నిహిత మిత్రులకు ఈ అగ్రికల్చర్ బిజినెస్ ని...

  • Publish Date - 7:08 pm, Sat, 13 February 21 Edited By: Anil kumar poka
'వ్యవసాయం భారత మాతదే, పారిశ్రామికవేత్తలది కాదు', కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ఈ దేశంలో వ్యవసాయ రంగం భారత మాతదేనని, పారిశ్రామికవేత్తలది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ తన ఇద్దరు సన్నిహిత మిత్రులకు ఈ అగ్రికల్చర్ బిజినెస్ ని అప్పగించాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజస్తాన్ అజ్మీర్ లోని రూపన్ నగర్ లో శనివారం జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రధాని మోదీ ఆప్షన్స్ ఇస్తున్నానని  చెబుతున్నారని, కానీ ఆయన ఇస్తున్నది ఆకలి, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలేనని తీవ్రంగా అన్నారు. మీరు అన్నదాతలను చర్చలకు ఆహ్వానిస్తున్నారు..కానీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు వారు చర్చలకు రాబోరు అని రాహుల్ పేర్కొన్నారు.. పారిశ్రామిక వేత్త అదానీ గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ..ఈ రోజున ఓ వ్యక్తి, ఓ బిజినెస్ మన్ దేశంలో 40 శాతం ఆహారధాన్యాలను కంట్రోల్ చేస్తున్నారని చెప్పారు. దేశంలో పెద్ద బిజినెస్ వ్యవసాయమే..ఇది 40 లక్షల కోట్ల వ్యాపారం.. 40 శాతం జనాభా ఈ బిజినెస్ పైనే ఆధారపడి ఉన్నారు.. మోదీజీ తన ఇద్దరు మిత్రులకు దీన్ని అప్పగించాలనుకుంటున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ పారిశ్రామిక వేత్త గోడౌన్ లో నలభై శాతం ఆహార ధాన్యాలు ఉన్నాయని, రైతు చట్టాలలో రెండవది 80 నుంచి 90 శాతం ధాన్యాలను ఈ వ్యక్తికి  ఇవ్వడానికి ఉద్దేశించినదేనని రాహుల్ అన్నారు.

రైతు చట్టాలు అమలయితే ఇండియాలో ఏ యువకుడికి ఉద్యోగం లభించబోదని ఆయన పేర్కొన్నారు. కాగా-కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం, తగిన సమయంలో రాష్ట్ర ప్రతిపత్తి

మరిన్ని చదవండి ఇక్కడ: కోవిడ్ పై పోరు, ఇక పిల్లలకూ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, త్వరలో క్లినికల్ ట్రయల్స్ మొదలు