కోవిడ్ పై పోరు, ఇక పిల్లలకూ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, త్వరలో క్లినికల్ ట్రయల్స్ మొదలు

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృధ్ది పరచిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ఇకపై పిల్లలకు కూడా వాడే సూచనలు కనిపిస్తున్నాయి. 6 నుంచి 17 ఏళ్ళ మధ్య వయస్సు గలవారికి ఈ టీకా మందు...

కోవిడ్ పై పోరు, ఇక పిల్లలకూ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, త్వరలో క్లినికల్ ట్రయల్స్ మొదలు
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Feb 13, 2021 | 5:27 PM

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృధ్ది పరచిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ఇకపై పిల్లలకు కూడా వాడే సూచనలు కనిపిస్తున్నాయి. 6 నుంచి 17 ఏళ్ళ మధ్య వయస్సు గలవారికి ఈ టీకా మందును వాడడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి చాలావరకు పెరుగుతుందని భావిస్తున్నామని ఈ యూనివర్సిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. ఇందుకు గాను అప్పుడే సుమారు 300 మంది ‘పిల్ల వలంటీర్లను’ సెలెక్ట్ చేశారట. ‘సీ హెచ్ ఎడాక్స్ ఎన్ కొవ్-19 గా వ్యవహరించే ఈ టీకామందు..ఈ వయసు పిల్లల్లో అత్యంత బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్ కలుగుతుందని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్, పిల్లల వ్యాధుల నిపుణుడు ఎండ్రు పోలార్డ్ తెలిపారు.  ప్రపంచ  వ్యాప్తంగా చాలామంది పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం లేదని, ఈ ఇన్ఫెక్షన్ తో వారు అనారోగ్యం బారిన పడిన సూచనలు కనబడలేదని ఆయన చెప్పారు. కానీ ఈ వయస్సు వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎంతగా పెరుగుతుందో చూడాల్సి ఉందని అన్నారు.

చిన్న పిల్లలు, 17 ఏళ్ళ లోపు యువతలో సార్స్ -కొవ్-2 ను ఎలా అదుపు చేయవచ్చుననడానికి ఈ కొత్త క్లినికల్ ట్రయల్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ నెలలో అప్పుడే దాదాపు 240 మంది పిల్లలకు ఆస్ట్రాజెనికా టీకా మందును ఇస్తామని పోలార్డ్ వెల్లడించారు. ఈ వయస్సువారికి ఈ ట్రయల్ ను నిర్వహించడం ఇదే మొదటిసారని ఈ యూనివర్సిటీ ఓ ఈ-మెయిల్ లో తెలిపింది. ఇతర వ్యాక్సిన్ల కన్నా ఈ వ్యాక్సిన్ చౌక అయినదని, సులభంగా రవాణా చేయవచ్ఛునని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిలో  300 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా- ఏప్రిల్ నెలలోగా నెలకు 200 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్నది మరో ధ్యేయం.

మరిన్ని చదవండి ఇక్కడ: కోవిడ్ భయంతో ఇండియా నుంచి పరాయి దేశాలకు బడాబాబుల ‘క్యూ’, పెరిగిన ‘లెక్క’ !

మరిన్ని చదవండి ఇక్కడ: సెనేట్ లో ట్రంప్ అభిశంసనపై విచారణ, డెమొక్రాట్లు వాడిన పదంపై రభస, లాయర్ల వీడియో ప్రదర్శన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu