Hyderabad mayor Vijayalakshmi: అనుచరుడికి జీహెచ్ఎంసీ జరిమానాపై స్పందించిన మేయర్ విజయలక్ష్మి.. ఏమన్నారంటే…?
తన మీద అభిమానంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీ పెట్టిన వారికి జీహెచ్ఎంసీ జరిమానా వేయడాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వాగతించారు...
Hyderabad mayor Vijayalakshmi: తన మీద అభిమానంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీ పెట్టిన వారికి జీహెచ్ఎంసీ జరిమానా వేయడాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వాగతించారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. మనమే నిబంధనలు రూపొందించుకున్నందున… ప్రజలతో పాటు అందరం కచ్చితంగా పాటించాలని కోరారు. దీంతో నగర సుందరీకరణతో పాటు అభివృద్ధికి సహకరించినవాళ్లం అవుతామని చెప్పుకొచ్చారు.
ఏం జరిగిందంటే..?
గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు.
Hello @Director_EVDM @CEC_EVDM, Can you please convey Mr. Atish Agarwal “special thanks” on behalf of the first citizen for dirtying the city! @GadwalvijayaTRS
Location: Himayatnagar X Roads @KTRTRS @SomeshKumarIAS @SmitaSabharwal @arvindkumar_ias pic.twitter.com/L4FfjJqtqy
— Robin Zaccheus (@RobinZaccheus) February 12, 2021