‘కోటి వృక్షార్చన పోస్టర్‌’ ఆవిష్కరించిన మంత్రులు.. ఈ నెల 17న ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు

ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 17వ తేదీన ఉద‌యం 10-00 గంట‌ల నుంచి 11-00 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం ఒక గంట వ్య‌వ‌ధిలో..

'కోటి వృక్షార్చన పోస్టర్‌' ఆవిష్కరించిన మంత్రులు.. ఈ నెల 17న ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 13, 2021 | 5:24 PM

ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 17వ తేదీన ఉద‌యం 10-00 గంట‌ల నుంచి 11-00 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం ఒక గంట వ్య‌వ‌ధిలో కోటి మొక్క‌లు నాటే కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తో క‌లిసి స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లోని త‌న నివాసంలో మంత్రి కోటి వృక్షార్చ‌న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించారు.

ముక్కోటి తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌… ప్ర‌త్యేక తెలంగాణ‌ను ఆవిష్క‌రించిన ఆద‌ర్శ మూర్తి కెసిఆర్ తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా… బంగారుమ‌యం చేస్తున్నారు. ఆకు పచ్చ తెలంగాణ సాధ‌న ఆయ‌న ల‌క్ష్యం. అందుకోసం ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేని విధంగా హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారని మంత్రి అన్నారు. 2015లో మొద‌లు పెట్టిన హ‌రిత హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు 230 కోట్ల మొక్క‌లు నాటాం. అట‌వీశాఖ అధికారుల లెక్క‌ల ప్ర‌కారం 4శాతం గ్రీన‌రీ పెరిగింది. హ‌రిత హారం కార్య‌క్ర‌మ విజ‌య‌వంతానికి ఇది నిద‌ర్శ‌నం అని మంత్రి వివ‌రించారు.

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణానికి, మాన‌వ క‌ళ్యాణానికి నిర్వ‌హిస్తున్న కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములై విజ‌య‌వంతం చేయాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఒక మొక్క నాటి ముఖ్య‌మంత్రి గారికి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృత‌జ్ఞ‌తా పూర్వ‌క బ‌హుమ‌తిని అంద‌చేద్దాం అని మంత్రి చెప్పారు. ఈ నెల ‌ఈ స‌ర్వ లోక స‌త్కార్య క్ర‌మంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ లు, వార్డు మెంబ‌ర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మ‌న్లు… స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులంతా, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పాల్గొనాల‌ని పిలుపు నిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత క‌న్నెబోయిన రాజ‌య్య యాద‌వ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్ర‌తినిధులు రాఘ‌వ్, కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more:

జానారెడ్డిగారూ.. ఇవిగో మిషన్‌ భగీరథ నీళ్లు.. జానారెడ్డి ఇంటిలో జలజలా రాలుతున్న భగీరథ నల్లాను చూపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు