మొఘల్‌ గార్డెన్స్‌ను ఆస్వాదించేందుకు అనుమతి.. సందర్శకులకు రూల్స్‌ అండ్‌ టైమింగ్స్‌ ఇవే

రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్టాత్మక మొఘల్‌ గార్డెన్స్‌ అందాలను ఆస్వాదించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ మేరకు వార్షిక 'ఉద్యానోత్సవ్'ను..

మొఘల్‌ గార్డెన్స్‌ను ఆస్వాదించేందుకు అనుమతి.. సందర్శకులకు రూల్స్‌ అండ్‌ టైమింగ్స్‌ ఇవే
Follow us
K Sammaiah

|

Updated on: Feb 13, 2021 | 5:05 PM

రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్టాత్మక మొఘల్‌ గార్డెన్స్‌ అందాలను ఆస్వాదించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ మేరకు వార్షిక ‘ఉద్యానోత్సవ్’ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఫిబ్రవరి 13 నుండి మార్చి 21 వరకు (సోమవారం మినహా) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు “మొఘల్ గార్డెన్ సందర్శనకు సాధారణ ప్రజలను అనుమతించనున్నారు.

మొఘల్ గార్డెన్స్ తో పాటు, రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో కూడా సందర్శకులకు అనుమతి ఉంటుంది. అలాగే ‘గార్డ్ మార్పు’ కార్యక్రమాన్ని కూడా సందర్శకులు తిలకించవచ్చు. అయితే కరోనా నేపథ్యంలో టికెట్ల కొనుగోలుకు సబంధించి పలు మార్పులు చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేస్తే గార్డెన్ లోకి ప్రవేశించే వెసులుబాటు ఈసారి రద్దు చేశారు. అడ్వాన్స్ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకున్న సందర్శకులు గార్డెన్ ను ఆస్వాదించే అవకాశం కల్పించారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రతి గంటకు ఏడు అడ్వాన్స్ బుకింగ్ లు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు సందర్శకుల కు చివరి ప్రవేశం ఉంటుంది. సందర్శకులు కరోనా ప్రోటోకాల్స్ ను తప్పక పాటించాలి. తప్పనిసరిగా మాస్క్ లు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఎంట్రీ పాయింట్ వద్ద విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించాలి. అనారోగ్యంతో ఉన్నవారికి అనుమతి ఉండదు. సందర్శకులందరికీ ప్రవేశం మరియు నిష్క్రమణ గేట్ నెంబరు 35 నుంచి ఉంటుందని రాష్ట్రపతి భవన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Read more:

జానారెడ్డిగారూ.. ఇవిగో మిషన్‌ భగీరథ నీళ్లు.. జానారెడ్డి ఇంటిలో జలజలా రాలుతున్న భగీరథ నల్లాను చూపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!