AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాగర్‌ ఉపఎన్నికకు పార్టీల సైరన్‌ .. టీఆర్‌ఎస్‌ సభకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్న కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు సిద్దమయ్యారు. నార్కట్‌ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వరకు..

సాగర్‌ ఉపఎన్నికకు పార్టీల సైరన్‌ .. టీఆర్‌ఎస్‌ సభకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్న కోమటిరెడ్డి
MP komatireddy
K Sammaiah
|

Updated on: Feb 13, 2021 | 6:03 PM

Share

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు సిద్దమయ్యారు. నార్కట్‌ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20 నుండి 26 వరకు పాదయాత్రకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ కు, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ప్రాజెక్టుల సాధ‌న యాత్ర పేరుతో పాద‌యాత్ర‌ నిర్వహిస్తానని కోమిరెడ్డి తెలిపారు.

బ్రా‌హ్మ‌ణ వెళ్లంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల‌ను వెంటనే పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులను నిర్ల‌క్ష్యం చేసిన ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌నగా వేలాది మందితో పాద‌యాత్ర‌ చేపట్టబోతున్నట్లు కోమ‌టి రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌ల్ల‌గొండ మీద ప్రేమ ఉన్న‌ట్టు వ్య‌వ‌హ‌ర్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే 2008లో బ్రాహ్మ‌ణ వెళ్లి ప్రాజెక్టును ప్రారంభించారు. రూ. 100 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్త‌వుతుందని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో రూ.1300 కోట్ల‌తో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నిర్మాణానికి ఖ‌ర్చుచేశాం. మ‌రో వెయ్యికోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్త‌వుతుందని కోమటిరెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాగ‌ర్ లో ఓట్ల కోసం ప్రాజెక్టుల బాట పట్టారని విమర్శించారు. సొరంగం మార్గం ఉంటే ఏపీ సీఎం జ‌గ‌న్ నీరు తీసుకు వెళ్లే వాడు కాదని కోమటిరడ్డి అన్నారు.

6 రోజుల పాటు 120 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర‌ ఉంటుందని చెప్పారు. నాలుగు ల‌క్షల ఎక‌రాక‌లు గ్రావిటీ ద్వారా నీరు వ‌స్తాయి. కాంగ్రెస్ కు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి పేరు వ‌స్తుంద‌నే ఈ ప్రాజెక్ట్ లను పెండింగ్ లో పెట్టారని ఆయన విమర్శించారు. శాంతియుతంగా చేసే పాద‌య‌త్రకు రైతులు స్వచ్చందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Read more:

‘కోటి వృక్షార్చన పోస్టర్‌’ ఆవిష్కరించిన మంత్రులు.. ఈ నెల 17న ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్