AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ భయంతో ఇండియా నుంచి పరాయి దేశాలకు బడాబాబుల ‘క్యూ’, పెరిగిన ‘లెక్క’ !

అంతర్జాతీయ (విదేశీ) ప్రయాణాలకు కోవిడ్ భయం బ్రేకులు వేసి ఉండవచ్చు.. కానీ ధనిక బాబులు మాత్రం  ఈ  దేశాన్ని వదిలివెళ్లకుండా ఈ మహమ్మారి ఆపలేకపోయింది.

కోవిడ్ భయంతో ఇండియా నుంచి పరాయి దేశాలకు బడాబాబుల 'క్యూ', పెరిగిన 'లెక్క' !
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 13, 2021 | 2:14 PM

Share

అంతర్జాతీయ (విదేశీ) ప్రయాణాలకు కోవిడ్ భయం బ్రేకులు వేసి ఉండవచ్చు.. కానీ ధనిక బాబులు మాత్రం  ఈ  దేశాన్ని వదిలివెళ్లకుండా ఈ మహమ్మారి ఆపలేకపోయింది.  వీరు  ఇతర దేశాల్లో జల్సాగా గడపడానికో లేదా ఆయా దేశాల్లో లాంగ్  టర్మ్ రెసిడెంట్స్ గా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికో లేక అక్కడి పౌరసత్వం తీసుకుని శాశ్వత పౌరులుగా మారిపోవడానికో అన్ని ప్రయత్నాలూ చేశారని తెలుస్తోంది. మీ దేశాల్లో పెట్టుబడులు పెడతాం.. మాకు నివాస సౌకర్యం కల్పిస్తారా అని ఎంక్వయిరీలు చేసే రిచ్ పీపుల్ సంఖ్య పెరిగిపోయిందట. అలాగే ‘సిటిజన్ షిప్ బై ఇన్వెస్ట్ మెంట్స్ ప్రోగ్రామ్స్’ అనే కార్యక్రమంపై కూడా వీరు వాకబు చేసినట్టు ముంబైలోని ఓ ఏజెన్సీ వెల్లడించింది.  ద్వంద్వ పొరసత్వాన్ని ఇండియాలోని చట్టాలు ఒప్పుకోవు గనుక..ఈ బడా బాబుల్లో చాలామంది సిటిజన్ షిప్ బై ఇన్వెస్టి మెంట్స్ నే ఎంచుకున్నారని తెలుస్తోంది. అంటే భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికే ఇష్టపడ్డారన్నది స్పష్టమవుతోంది.

2019 తో పోలిస్తే 2020 లో ఇలాంటి వారి సంఖ్య 63 శాతం పెరిగినట్టు ఈ ఏజన్సీ వెల్లడించింది. ఇన్వెస్టిమెంట్స్ పెడతాం.. మాకు నివాస సౌకర్యం కల్పించండి అంటూ యూఎస్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, టర్కీ వంటి దేశాలకు వెళ్ళగోరేవారు వాకబు చేసినట్టు గ్లోబల్ సౌత్ ఏసియా టీమ్ హెన్లే, పార్ట్ నర్స్ హెడ్ నిర్భయ్ హందా తెలిపారు. 2019 లో సుమారు 7 వేలమంది సంపన్నులు ఇండియా  నుంచి పరాయి దేశాలకు వెళ్లిపోయారని అంచనా..  ఇక పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు చెందిన ధనికులు కూడా ఇలాగే అన్ని వివరాలు తెలుసుకున్నారని ఈ  సంస్థ తెలిపింది.

2019 లో మన దేశంలో సుమారు 1500 ఎంక్వయిరీలు వచ్చాయని హందా చెప్పారు. కాగా ఆస్ట్రియా అయితే 187 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పిస్తోంది. అలాగే మాల్టా సైతం యూరోపియన్ యూరోపియన్ దేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటును కల్పించినట్టు ఈ ఏజన్సీ వెల్లడించింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Red Fort Violence: రెడ్‌ఫోర్ట్‌ ముట్టడి ఘటనపై స్పెషల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్..

మరిన్ని చదవండి ఇక్కడ: Sister Murder: దారుణం.. లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు అక్కను హత్య చేసిన తమ్ముడు