AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sister Murder: దారుణం.. లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు అక్కను హత్య చేసిన తమ్ముడు

Sister Murder: ఓ నిందితుడు సామూహిక లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు సొంత అక్కనే హత్య చేశాడు. లైంగిక దాడి బాధితురాలి కుటుంబ సభ్యులపై ఈ నేరాన్ని ..

Sister Murder: దారుణం.. లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు అక్కను హత్య చేసిన తమ్ముడు
Subhash Goud
|

Updated on: Feb 13, 2021 | 1:35 PM

Share

Sister Murder: ఓ నిందితుడు సామూహిక లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు సొంత అక్కనే హత్య చేశాడు. లైంగిక దాడి బాధితురాలి కుటుంబ సభ్యులపై ఈ నేరాన్ని మోపేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. 21 ఏళ్ల అంకిత్‌ చౌదరి జనవరి 18న తన బంధువైన అక్షయ్‌తో కలిసి దళిత మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దిండౌలి పోలీసు స్టేషన్‌లో వీరిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

మరోవైపు లైంగిక దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు అంకిత్‌ ఒక పథకం పన్నాడు. ఉద్యోగం నిమిత్తం నాలుగేళ్లుగా ఢిల్లీలో ఉంటున్న పెద్ద అక్కనేహాను హత్య చేసి ఆ నేరాన్ని లైంగికదాడి బాధితురాలి కుటుంబంపై మోపేందుకు పథకం పన్నాడు. ఈనెల 7న తన అక్కకు అంకిత్‌ ఫోన్‌ చేశాడు. కేసు సెటిల్‌ కోసం మాట్లాడేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు రమ్మంటున్నారని చెప్పాడు.

అనంతరం ఒక కార్‌ను బుక్‌ చేసి ఢిల్లీ వెళ్లాడు. అక్క నేహాతో కలిసి కారులో అమ్రోహాకు బయలుదేరాడు. గ్రీన్‌ కాలనీ వద్ద కారును ఆపించి ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలోని ఖాళీ స్థలానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ తన అక్క గొంతునులమడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే ఇటుకతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అక్క చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె దుస్తులను సమీపంలోని పొదల్లో పడేశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి దాక్కున్నాడు.

మరోవైపు నేహ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు ఆమెను అంకిత్‌ కారులో తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీంతో అంకిత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజాన్ని బయట పెట్టాడు. తన అక్కను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. లైంగిక దాడి కేసు నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అంకిత్‌ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అంకిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Rinku Sharma Murder: భజరంగ్‌దళ్‌ కార్యకర్త రింకు శర్మ హత్య కేసు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ

Nandyal Families Fight: రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చెత్త, కుక్క.. కత్తులతో దాడి.. చివరకు ఏమైందంటే..!

Firecracker Factory: టపాకాయల తయారీ కేంద్రంలో మరో భారీ పేలుడు.. మంటలను ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది