Firecracker Factory: టపాకాయల తయారీ కేంద్రంలో మరో భారీ పేలుడు.. మంటలను ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది
Firecracker Factory: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం భారీ పేలుడు...
Firecracker Factory: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం భారీ పేలుడు జరుగగా, శనివారం మరో పేలుడుతో బాణసంచా తయరీ కేంద్రం దద్దరిల్లిపోయింది. శుక్రవారం జరిగిన పేలుడలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 19కి చేరగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా విరుదునగర్ జిల్లాలో మరో పేలుడు జరిగింది. శివకాశిలో ఉన్న టపాకాయల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
కాగా, నిన్న జరిగిన ప్రమాదంలో 14 మందికి 60 నుంచి70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులు మధురై రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, పేలుళ్ల ధాటికి బాణసంచా ఫ్యాక్టరీలోని మూడు షెడ్లు కుప్పకులాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ నామ రూపాలు లేకుండా పోయింది. సత్తూరు, శివకాశి, వెంబకొట్టాయ్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Firecracker Factory: బతుకులు బుగ్గిపాలు.. 17కు చేరిన మృతుల సంఖ్య.. 14 మంది పరిస్థితి మరింత విషమం