Rinku Sharma Murder: భజరంగ్‌దళ్‌ కార్యకర్త రింకు శర్మ హత్య కేసు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ

Rinku Sharma Murder: ఢిల్లీలో భజరంగ్‌దళ్‌ కార్యకర్తల రింకు శర్మ హత్య కేసును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని పోలీసులు శనివారం నిర్ణయించారు. రింకు శర్మ..

Rinku Sharma Murder: భజరంగ్‌దళ్‌ కార్యకర్త రింకు శర్మ హత్య కేసు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 13, 2021 | 12:14 PM

Rinku Sharma Murder: ఢిల్లీలో భజరంగ్‌దళ్‌ కార్యకర్తల రింకు శర్మ హత్య కేసును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని పోలీసులు శనివారం నిర్ణయించారు. రింకు శర్మ హత్య కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జైశ్రీరామ్‌ నినాదాలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఇస్లాంవాదులు హత్య చేశారని రింకు శర్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బర్త్‌డే పార్టీలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణగా మారి హత్యకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడు రింకు శర్మ (25)గా గుర్తించారు పోలీసులు. మృతుడు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. గురువారం రాత్రి స్నేహితుడు డానిష్‌తో కలిసి ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లారు. పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం తలెత్తింది. పార్టీ అనంతరం రింకు శర్మ తన ఇంటికి వెళ్లగా, డానిష్‌ మరో ముగ్గురు స్నే‌హితులతో కలిసి రింకు శర్మపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రింకును స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు.

అయితే రింకు శర్మకు విశ్వహిందూ పరిషత్‌ సంస్థతో సంబంధం ఉందని, అయోధ్యలోని రామ మందిరానికి విరాళాలు సేకరిస్తున్నందునే కొంత మంది దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ కూడా ఇవే ఆరోపణలు చేయగా, పోలీసులు మాత్రం ఖండించారు. ఇందులో కీలక ఆధారాల కోసం కేసును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

Also Read: Nandyal Families Fight: రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చెత్త, కుక్క.. కత్తులతో దాడి.. చివరకు ఏమైందంటే..!