AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghatkesar Rape Case: ఘట్‌కేసర్‌ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిజాలు వెలుగులోకి..

సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్‌లో బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులోఅసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని

Ghatkesar Rape Case: ఘట్‌కేసర్‌ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిజాలు వెలుగులోకి..
Crime News
uppula Raju
|

Updated on: Feb 13, 2021 | 12:57 PM

Share

సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్‌లో బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులోఅసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. తప్పుడు కేసుగా నిర్ధారించామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు వీగిపోయింది. కుటుంబ వివాదాలతోనే యువతి బయటకు వెళ్లిందన్నారు. కావాలనే యువతి కట్టుకథ అల్లిందని వివరించారు.

విద్యార్థిని ప్రతిరోజు రంపల్లి బస్ స్టాప్ దగ్గర ఆటో దిగి అక్కడి నుండి ఇంటికి వెళుతుంది. అయితే 10 వ తేదీన ఇంటికి ఫోన్ చేసి ఆటో ఆపలేదని చెప్పింది. 7:45 కు మళ్ళీ ఫోన్ చేసి తనను కొందరు కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమని అడిగితే పెట్టింది. అది అనోజిగుడ ప్రాంతం అక్కడికి పోలీసులు వచ్చి చూసేసరికి అమ్మాయి చిరిగిపోయిన దుస్తులతో కనిపించింది. వెంటనే అమ్మాయిని దగ్గరలోని క్యూర్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

తర్వాత అమ్మాయిని ఎక్కిన ఆటో గురించి ఆనవాలు అడిగాం, కొంచెం డామేజ్ అయిన మూడు ఆటోలు గుర్తించి కొంత మంది ఆటో డ్రైవర్ ఫోటోలు చూపిస్తే అమ్మాయి వారిని గుర్తించింది. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ల పై కేసులు నమోదు చేశాం. తన పై ఆటో డ్రైవర్ లు రేప్ చేశారని మాకు స్టేట్ మెంట్ ఇచ్చింది. రేప్ జరిగిందా లేదా అనే విషయం పై హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేయించాం. మరోమారు తన పై కర్రలతో దాడి చేశారని యువతి తెలిపింది. ఆటో వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించాం. సైంటిఫిక్ దర్యాప్తు లో ఆటో డ్రైవర్ తప్పు లేదని తేలింది. అమ్మాయి రేప్ జరిగింది అని చెప్పిన సమయానికి ఆటో డ్రైవర్ ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళారు. అన్ని సీసీ టీవీ లు పరిశీలించాక ఆటో డ్రైవర్ చెప్పింది నిజం అని తేలింది. అమ్మాయి పోలిసులను తప్పు దోవ పట్టించిందన్నారు.

యన్నం పేట్ దగ్గర అమ్మాయి ఆటో దిగిన సీసీ ఫుటేజ్ మాకు దొరికింది. యన్నంపేట్ నుంచి అంజోజి గూడా వరకు 100 సీసీ ఫుటేజ్ గమనించాం. ఈ కేసు లో సీసీ ఫుటేజ్ లు కీలక ఆధారాలుగా నిలిచాయి. యాన్నం పేట్ నుండి 4 కిలో మీటర్ లు అమ్మాయి నడిచింది. కిడ్నాప్ ఎలా చేయాలో అమ్మాయి కి బాగా తెలుసు. గతంలో ఆరునెలల క్రితం ఇదే తరహా లో కిడ్నాప్ ప్లాన్ చేసింది. తన పై ఎలాంటి రేప్ జరగలేదని అమ్మాయి చెప్పింది. అమ్మాయి కి ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ఎప్పటి నుంచో ఉంది. 6 నెలల క్రితం తన ఫ్రెండ్ కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పింది. అమ్మాయికి కిడ్నాప్ లు అంటే ఒక రకమైన ఇష్టం.ఈ కేస్ లో ఆటో డ్రైవర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. విచారణ లో భాగంగా ఆటో డ్రైవర్ లను విచారించాం వారి తప్పు లేదు. వారు మాకు బాగా సహకరించారు.. వారికి క్షమాపణలు చెబుతున్నామని  సీపీ చెప్పారు.

Gangrape: ఇంతకంటే దారుణం ఉండదేమో.. రక్షక భటుడే భక్షకుడయ్యాడు.. కాపాడయ్యా అంటే కాటేశాడు..