AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangrape: ఇంతకంటే దారుణం ఉండదేమో.. రక్షక భటుడే భక్షకుడయ్యాడు.. కాపాడయ్యా అంటే కాటేశాడు..

ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌ పూర్‌లో దారుణం వెలుగు చూసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధిత మహిళపై ఓ పోలీసు..

Gangrape: ఇంతకంటే దారుణం ఉండదేమో.. రక్షక భటుడే భక్షకుడయ్యాడు.. కాపాడయ్యా అంటే కాటేశాడు..
Shiva Prajapati
|

Updated on: Dec 25, 2020 | 5:35 AM

Share

Gangrape: ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌ పూర్‌లో దారుణం వెలుగు చూసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధిత మహిళపై ఓ పోలీసు అధికారి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35) మదన్‌పూర్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఐదుగురు దుండగలు వచ్చి ఆమెను బలవంతంగా కారులో లాక్కెళ్లారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వదిలేశారు. దాంతో బాధిత మహిళ జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే ఆ స్టేషన్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ బాధిత మహిళను తన గదిలోకి లాక్కెళ్లి బలత్కారం చేశాడు. ఆ తరువాత జరిగిన దారుణాన్ని సావధానంగా విని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపించాడు. అయితే, పోలీసులు సైతం తనపై దారుణానికి ఒడిగట్టడంతో బాధితురాలు నేరుగా బరేలి ఏడీజీ అవినాష్ చంద్రను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన ఏడీజీ. విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also read:

Christmas: క్రిస్మస్ వేళ రుచికరమైన కేక్‏.. సులభంగా మీ వంటింట్లోనే తయారుచేసుకోండిలా..

హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రిక్తత.. నిప్పుఅంటుకొని పోలీసు అధికారికి తీవ్రగాయాలు

స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?