Red Fort Violence: రెడ్‌ఫోర్ట్ ముట్టడి ఘటనపై స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్..
26న గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్ పరేడ్ హింస..యావత్ దేశాన్ని వణికించింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. బారికేడ్లు, బస్సులు, వాహనాలను ధ్వంసం..
Red Fort Violence: 26న గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్ పరేడ్ హింస..యావత్ దేశాన్ని వణికించింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. బారికేడ్లు, బస్సులు, వాహనాలను ధ్వంస చేశారు. ఎర్రకోటను ముట్టడించి జాతీయ జెండా పక్కన కిసాన్ ఫ్లాగ్‌ను ఎగురవేశారు.
ఐతే ఈ రెడ్‌ఫోర్ట్ ముట్టడి ఘటనకు పంజాబ్ నటుడు దీప్‌సిద్ధూనే కారణమని ఆరోపణలొచ్చాయి. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అతనితో పాటు ఇక్బాల్‌సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇవాళ వీరిద్దరినీ ఎర్రకోటకు తీసుకొచ్చారు. ఆ రోజున అసలేం జరిగిందన్న అంశంపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు.
26th January violence: Accused Iqbal Singh and Deep Sidhu being brought to the Red Fort, as a part of the investigation. pic.twitter.com/bSAyyVi4EM
— ANI (@ANI) February 13, 2021
ఇవి కూడా చదవండి
Ind vs Eng: పటిష్ట స్థితిలో టీమిండియా.. రోహిత్ శర్మ, రహనేల అద్భుత భాగస్వామ్యం..