Ind vs Eng: పటిష్ట స్థితిలో టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300/6

Ravi Kiran

|

Updated on: Feb 13, 2021 | 5:10 PM

India vs England, 1st Test, Day 2 LIVE Score: తొలి టెస్టులో పరాజయం ఎదుర్కున్న కోహ్లీసేన.. శనివారం నుంచి ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో మరో సమరానికి...

Ind vs Eng: పటిష్ట స్థితిలో టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300/6

India vs England, 1st Test, Day 2 LIVE Score: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. తొలి టెస్టులో పరాజయం ఎదుర్కున్న కోహ్లీసేన.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. అటు ఇంగ్లాండ్ కూడా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. అలాగే ఇంగ్లాండ్‌లో బ్రాడ్, స్టోన్, ఫోక్స్ ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు.

భారత జట్టు(ఫైనల్ ఎలెవన్): రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు(ఫైనల్ ఎలెవన్): సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 300/6

రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(28*), అక్షర్ పటేల్(5*) ఉన్నారు.

అశ్విన్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా…

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. టీమిండియాను దెబ్బ తీశాడు. అశ్విన్ రూపంలో ఆరో వికెట్ ను తీసి.. తొలి రోజు చివరి సెషన్‌లో పైచేయి సాధించాడు. దీనితో 83 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 284-6 చేసింది.

రహనే ఔట్.. వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా..

టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న రహనే(67), రోహిత్ శర్మ(161) వెంటవెంటనే పెవిలియన్ బాట పడ్డారు. దీనితో 249 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శర్మ ఔట్.. ఇంగ్లాండ్‌కు రిలీఫ్..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(161)ను ఇంగ్లాండ్ బౌలర్లు ఎట్టకేలకు పెవిలియన్ పంపారు. భారీ షాట్ కొట్టేందుకు స్వీప్ చేసిన రోహిత్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 248 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శర్మకు మరో లక్.. స్టంపింగ్ జస్ట్ మిస్..

ఓపెనర్ రోహిత్ శర్మకు మరో లైఫ్ దొరికింది. లీచ్ బౌలింగ్ భారీ షాట్ ఆడేందుకు రోహిత్ క్రీజు నుంచి ముందుకు రాగా.. ఇంగ్లాండ్ టీం స్టంపింగ్ కోసం థర్డ్ అంపైర్‌కు రివ్యూ ఇచ్చారు. బెయిల్స్ బయటికి వచ్చేటప్పటికీ రోహిత్ క్రీజులోకి వచ్చేయడంతో.. జస్ట్ స్టంపింగ్ నుంచి మిస్ అయ్యాడు.

రహనే అర్ధ సెంచరీ.. 200 దాటిన టీమిండియా స్కోర్..

మూడు వికెట్లు పడిన తర్వాత టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(136), వైస్ కెప్టెన్ రహనే(50) ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రహనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే జట్టు స్కోర్ కూడా 200 దాటింది. ప్రస్తుతం టీమిండియా 60 ఓవర్లు ముగిసేసరికి 207-3 పరుగులు చేసింది.

పటిష్ట స్థితిలో టీమిండియా.. రోహిత్ శర్మ, రహనేల అద్భుత భాగస్వామ్యం..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(124*), వైస్ కెప్టెన్ అజింక్య రహనే(35*) అద్భుత భాగస్వామ్యం భారత్‌ను పటిష్ట స్థితిలో పెట్టింది. ప్రస్తుతం 50 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసింది. అంతకముందు ఖాతా తెరవకుండానే టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గిల్(0) డకౌట్ కాగా.. ఆ తర్వాత వరుస ఇంటర్వెల్స్‌లో పుజారా(20), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు.

సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. ఆనందంలో డగౌట్.. ప్రేక్షకులు హర్షం..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(100*) సెంచరీ బాదేశాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. 131 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ.. రహనే(26)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం టీమిండియా 42 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(101*), రహనే(26*) క్రీజులో ఉన్నారు.

శతకానికి చేరువలో రోహిత్ శర్మ.. నిలకడగా ఆడుతోన్న రహనే..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(82) శతకానికి చేరువలో ఉన్నాడు. వరుస వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. ఒకవైపు నుంచి ఆదుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. ఇక రోహిత్‌కు అండగా.. రహనే(8) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టానికి 111 పరుగులు చేసింది.

సెంచరీ దాటిన టీమిండియా స్కోర్.. 25 ఓవర్లకు 100/3

టీమిండియా స్కోర్ వంద పరుగులు దాటింది. ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా.. మరోవైపు రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. దీనితో టీమిండియా 25 ఓవర్లకు 100/3 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(75), రహనే(4)తో ఉన్నారు.

వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లీ డకౌట్..

టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(65), పుజారా(21) ఆచితూచి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నారు అని అనుకునేలోపే ఇంగ్లాండ్ మళ్లీ పైచేయి సాధించింది. స్పిన్‌ను రంగంలోకి దింపి.. వరుస ఓవర్లలో రెండు వికెట్లను తీసింది. అదీ కూడా కోహ్లీ(0) డకౌట్‌గా పెవిలియన్ చేరించింది.

రోహిత్ శర్మ అర్ధ సెంచరీ.. దూకుడుగా ఆడుతోన్న టీమిండియా..

ఓపెనర్ రోహిత్ శర్మ(50) అర్ధ సెంచరీ బాదేసాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వన్డే మ్యాచ్ మాదిరిగా టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.

నిలకడగా ఆడుతోన్న టీమిండియా.. 10 ఓవర్లకు 36/1

ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. ఒకవైపు రోహిత్ శర్మ(30) బౌండరీలతో స్కోర్ కార్డును ముందుకు కదిలిస్తుంటే.. పుజారా(7) అతడికి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి 36/1 పరుగులు చేసింది.

బ్రాడ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు..

ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన మూడో ఓవర్‌లో పుజారా, రోహిత్ శర్మ చెరో బౌండరీ కొట్టారు. ఎక్స్‌ట్రా కవర్ మీదుగా మొదటి బంతికి రోహిత్ ఫోర్ కొట్టగా.. చివరి బంతికి పుజారా థర్డ్ మ్యాన్ బౌండరీ దిశగా ఫోర్ కొట్టాడు. దీనితో టీమిండియా మూడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.

మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా…

తుది జట్టులో చోటు దక్కించుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న ఓలి స్టోన్.. తన మొదటి ఓవర్‌లోనే గిల్(0) డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. చక్కటి ఇన్‌స్వింగర్‌కు గిల్ వికెట్ల ముందు దొరికాడు. దీనితో టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2021 05:09 PM (IST)

    తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 300/6

    రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(28*), అక్షర్ పటేల్(5*) ఉన్నారు.

  • 13 Feb 2021 04:46 PM (IST)

    అశ్విన్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా…

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. టీమిండియాను దెబ్బ తీశాడు. అశ్విన్ రూపంలో ఆరో వికెట్ ను తీసి.. తొలి రోజు చివరి సెషన్‌లో పైచేయి సాధించాడు. దీనితో 83 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 284-6 చేసింది.

  • 13 Feb 2021 04:14 PM (IST)

    రెండు ఫోర్లు బాదిన రిషబ్ పంత్..

    మొయిన్ అలీ బౌలింగ్‌లో రిషబ్ పంత్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. మిడ్ ఆఫ్, బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా రెండు ఫోర్లు కొట్టాడు. దీనితో 82 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 284-5 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 03:59 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్.. ఇంగ్లాండ్‌కు రిలీఫ్..

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(161)ను ఇంగ్లాండ్ బౌలర్లు ఎట్టకేలకు పెవిలియన్ పంపారు. భారీ షాట్ కొట్టేందుకు స్వీప్ చేసిన రోహిత్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 248 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 13 Feb 2021 03:56 PM (IST)

    రోహిత్ శర్మకు మరో లక్.. స్టంపింగ్ జస్ట్ మిస్..

    ఓపెనర్ రోహిత్ శర్మకు మరో లైఫ్ దొరికింది. లీచ్ బౌలింగ్ భారీ షాట్ ఆడేందుకు రోహిత్ క్రీజు నుంచి ముందుకు రాగా.. ఇంగ్లాండ్ టీం స్టంపింగ్ కోసం థర్డ్ అంపైర్‌కు రివ్యూ ఇచ్చారు. బెయిల్స్ బయటికి వచ్చేటప్పటికీ రోహిత్ క్రీజులోకి వచ్చేయడంతో.. జస్ట్ స్టంపింగ్ నుంచి మిస్ అయ్యాడు.

  • 13 Feb 2021 03:40 PM (IST)

    రోహిత్ శర్మ 150 నాటౌట్.. నిలకడగా రహనే బ్యాటింగ్..

    హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండో టెస్టులో తనదైన మార్క్ షాట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. కొంత వ్యవధిలోనే 150 మార్క్‌ను సైతం చేరుకున్నాడు. అటు రహనే(59*) నిలకడైన ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు.

  • 13 Feb 2021 03:19 PM (IST)

    నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యం.. ధీటుగా జవాబిస్తున్న టీమిండియా..

    ఇంగ్లాండ్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్ ధీటుగా జవాబిస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(146*), రహనే(55*) అద్భుత పోరాటం ముందు ఇంగ్లీష్ జట్టు బౌలర్లు తేలిపోయారు. ఈ ఇద్దరి బ్యాట్స్‌మెన్ నాలుగో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లు ముగిసేసరికి 222-3 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 03:09 PM (IST)

    రహనే అర్ధ సెంచరీ.. 200 దాటిన టీమిండియా స్కోర్..

    మూడు వికెట్లు పడిన తర్వాత టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(136), వైస్ కెప్టెన్ రహనే(50) ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రహనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే జట్టు స్కోర్ కూడా 200 దాటింది. ప్రస్తుతం టీమిండియా 60 ఓవర్లు ముగిసేసరికి 207-3 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 01:57 PM (IST)

    పటిష్ట స్థితిలో టీమిండియా.. రోహిత్ శర్మ, రహనేల అద్భుత భాగస్వామ్యం..

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(124*), వైస్ కెప్టెన్ అజింక్య రహనే(35*) అద్భుత భాగస్వామ్యం భారత్‌ను పటిష్ట స్థితిలో పెట్టింది. ప్రస్తుతం 50 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసింది.

    అంతకముందు ఖాతా తెరవకుండానే టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గిల్(0) డకౌట్ కాగా.. ఆ తర్వాత వరుస ఇంటర్వెల్స్‌లో పుజారా(20), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు.

  • 13 Feb 2021 01:25 PM (IST)

    సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. ఆనందంలో డగౌట్.. ప్రేక్షకులు హర్షం..

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(100*) సెంచరీ బాదేశాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. 131 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ.. రహనే(26)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం టీమిండియా 42 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(101*), రహనే(26*) క్రీజులో ఉన్నారు.

  • 13 Feb 2021 01:03 PM (IST)

    మొయిన్ అలీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ భారీ సిక్స్

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. వన్డే మ్యాచ్ మాదిరిగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రీజు ముందుకు వచ్చి.. లాంగ్ ఆఫ్ మీదుగా భారీ సిక్స్ బాదాడు. దీనితో రోహిత్ శర్మ(97*) పరుగులకు చేరుకున్నాడు. అటు రహనే(21*) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 38 ఓవర్లు ముగిసేసరికి 139-3 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 12:36 PM (IST)

    శతకానికి చేరువలో రోహిత్ శర్మ.. నిలకడగా ఆడుతోన్న రహనే..

    హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(82) శతకానికి చేరువలో ఉన్నాడు. వరుస వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. ఒకవైపు నుంచి ఆదుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. ఇక రోహిత్‌కు అండగా.. రహనే(8) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టానికి 111 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 12:27 PM (IST)

    రోహిత్ శర్మకు ఓ లైఫ్..

    లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. అయితే లైన్‌ను ఔట్ సైడ్ ఆఫ్ బంతి పిచ్ అవుతుండటంతో.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

  • 13 Feb 2021 11:35 AM (IST)

    సెంచరీ దాటిన టీమిండియా స్కోర్.. 25 ఓవర్లకు 100/3

    టీమిండియా స్కోర్ వంద పరుగులు దాటింది. ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా.. మరోవైపు రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. దీనితో టీమిండియా 25 ఓవర్లకు 100/3 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(75), రహనే(4)తో ఉన్నారు.

  • 13 Feb 2021 11:16 AM (IST)

    వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లీ డకౌట్..

    టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(65), పుజారా(21) ఆచితూచి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నారు అని అనుకునేలోపే ఇంగ్లాండ్ మళ్లీ పైచేయి సాధించింది. స్పిన్‌ను రంగంలోకి దింపి.. వరుస ఓవర్లలో రెండు వికెట్లను తీసింది. అదీ కూడా కోహ్లీ(0) డకౌట్‌గా పెవిలియన్ చేరించింది.

  • 13 Feb 2021 10:49 AM (IST)

    రోహిత్ శర్మ అర్ధ సెంచరీ.. దూకుడుగా ఆడుతోన్న టీమిండియా..

    ఓపెనర్ రోహిత్ శర్మ(50) అర్ధ సెంచరీ బాదేసాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వన్డే మ్యాచ్ మాదిరిగా టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 10:27 AM (IST)

    నిలకడగా ఆడుతోన్న టీమిండియా.. 10 ఓవర్లకు 36/1

    ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. ఒకవైపు రోహిత్ శర్మ(30) బౌండరీలతో స్కోర్ కార్డును ముందుకు కదిలిస్తుంటే.. పుజారా(7) అతడికి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి 36/1 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 09:59 AM (IST)

    బ్రాడ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు..

    ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన మూడో ఓవర్‌లో పుజారా, రోహిత్ శర్మ చెరో బౌండరీ కొట్టారు. ఎక్స్‌ట్రా కవర్ మీదుగా మొదటి బంతికి రోహిత్ ఫోర్ కొట్టగా.. చివరి బంతికి పుజారా థర్డ్ మ్యాన్ బౌండరీ దిశగా ఫోర్ కొట్టాడు. దీనితో టీమిండియా మూడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.

  • 13 Feb 2021 09:51 AM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా… 

    తుది జట్టులో చోటు దక్కించుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న ఓలి స్టోన్.. తన మొదటి ఓవర్‌లోనే గిల్(0) డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. చక్కటి ఇన్‌స్వింగర్‌కు గిల్ వికెట్ల ముందు దొరికాడు. దీనితో టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది.

Published On - Feb 13,2021 5:09 PM

Follow us
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..

ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి

వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?

కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి