India Vs England: రోహిత్ శర్మ, రహనేల అద్భుత పోరాటం.. పటిష్ట స్థితిలో భారత్.. స్కోర్ల వివరాలివే..
India Vs England 2nd Test Day 1: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది...
India Vs England 2nd Test Day 1: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(28*), అక్షర్ పటేల్(5*) ఉన్నారు. రెండో రోజు వీరిద్దరూ ఎంతసేపు క్రీజులో నిలదొక్కుకుంటారన్న దానిపై టీమిండియా స్కోర్ ఆధారపడి ఉందని చెప్పాలి.
అంతకముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్(0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(161)తో ఇంకో ఎండ్ నుంచి పరుగుల వరద పారించాడు. పుజారా(20)తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ చక్కదిద్దేలోపు.. ఇంగ్లాండ్ పుంజుకుని వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. పుజారా(20), విరాట్ కోహ్లీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ రహనే(67) రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడం.. వెంటనే అశ్విన్ కూడా ఔట్ అయ్యాడు. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్, అలీ రెండేసి వికెట్లు, స్టోన్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు.