India vs England: చెన్నై చెపాక్ స్టేడియంపై ఇంగ్లండ్ మాజీ క్యాప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడంటే..
Michael Vaughan: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Michael Vaughan: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చెపాక్ స్టేడియంపై ఇంగ్లండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మిచెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బౌలింగ్ విషయంలో చెపాక్ స్టేడియాన్ని ‘బీచ్’ గా వర్నించిన వాన్.. ఈ పిచ్‌పై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేస్తే అది 500 పరుగులతో సమానం అని పేర్కొన్నాడు. అంతేకాదు.. ఈ స్టేడియంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ టీమ్.. మ్యాచ్ గెలిస్తే మాత్రం అది ఒక చెరగని చరిత్రే అవుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియాలో స్పిన్నర్లు అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారని, వీరి బౌలింగ్ ఇంగ్లండ్ టీమ్ జాగ్రత్తంగా ఆడాలని వాన్ వార్నింగ్ ఇచ్చాడు.
Also read:
INDIA VS ENGLAND 2021 : మూడు మార్పులతో బరిలోకి దిగిన భారత్.. తుది జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు చోటు..