INDIA VS ENGLAND 2021 : మూడు మార్పులతో బరిలోకి దిగిన భారత్.. తుది జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు చోటు..
INDIA VS ENGLAND 2021 : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. తుది జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది.
INDIA VS ENGLAND 2021 : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. తుది జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది. తొలి టెస్టులో బ్యాట్‌తో అదరగొట్టి బంతితో విఫలమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడేళ్లకు అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. దీంతో భారత్ తరఫున 302వ టెస్టు ఆటగాడిగా అక్షర్ పటేల్ అరంగ్రేటం చేశాడు.
మరోవైపు తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన నదీమ్‌కు బదులు ఈ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. తొలి టెస్టులోనే అతడికి అవకాశం వస్తుందని భావించినా అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. టీమ్‌ఇండియా అనూహ్యంగా నదీమ్‌ను తీసుకొని షాకిచ్చింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఎట్టకేలకు కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశమిచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత కుల్‌దీప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పనిభారం ఎక్కువ అవుతుందనే ఆలోచనతో ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్‌ను తీసుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.
India vs England: టీమిండియా సారథి కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలి