Ind Vs Eng: ఇంగ్లాండ్ విజృంభణ.. వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా.. లంచ్ విరామానికి భారత్ స్కోర్ ఎంతంటే.!
India Vs England 2nd Test Day 1: చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా..
India Vs England 2nd Test Day 1: చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ మూడేసి మార్పులతో బరిలోకి దిగాయి. ఇదిలా ఉంటే ఖాతా తెరవకుండా తొలి వికెట్ కోల్పోయిన భారత్‌ను.. రోహిత్ శర్మ(71), పుజారా(20) ఆదుకున్నారు. అయితే అనూహ్యంగా ఇంగ్లాండ్ పుంజుకుని వరుస విరామాల్లో రెండు వికెట్లు తీసింది. దీనితో గిల్(0), కోహ్లీ(0) డకౌట్‌గా పెవిలియన్ చేరగా.. పుజారా(20) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు.
వరుస వికెట్లు పతనమవుతున్నా.. ఒక ఎండ్‌లో రోహిత్ శర్మ(75) స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కాగా, లంచ్ విరామానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(75*), రహనే(4*) ఉన్నారు.
మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ ఇలా చూడొచ్చు..
భారత్, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అంతేకాకుండా డిస్నీ హాట్‌స్టార్, డిస్నీ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్ తిలకించవచ్చు. అలాగే లైవ్ స్కోర్ అండ్ కీలక అప్‌డేట్స్ కోసం
ఈ లింక్ క్లిక్ చేయండి.. https://tv9telugu.com/sports/cricket-news/series/india-vs-england-2021-22