Rohit Sharma: సరికొత్త రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్ రోహిత్.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా..
Rohit Sharma: చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ విజృంభించాడు.
Rohit Sharma: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభం మొదలు చెలరేగి ఆడుతున్న హిట్‌మ్యాన్.. 150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. అయితే, రోహిత్ తాజా నమోదు చేసిన సెంచరీతో సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక దేశాలపై అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన టీమిండియా తొలి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. 2021లో తొలి సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన రోహిత్.. భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 40 సెంచరీలు నమోదు చేసిన రోహిత్.. టీమిండియా ప్లేయర్లలో 4వ వ్యక్తిగా నిలిచాడు.
రహానే విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు.. ఇదిలాఉంటే.. రోహిత్ శర్మ తన ఆటతీరుతో జట్టు వైఎస్ కెప్టెన్ అజింక్య రహానే విశ్వాసాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జగిరిగని మ్యాచ్‌లతో పాటు, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ రోహిత్ సరిగా రాణించలేకపోయాడు. దాంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు జట్టు వైస్ కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్లేయర్లనూ తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. రెండు, మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమైనంత మాత్రాన ఆటగాలు పూర్తిగా విఫలమైనట్లు కాదని రోహిత్‌ను వెనకేసుకొచ్చాడు. అంతేకాదు.. రోహిత్‌పై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని, అతను తప్పకుండా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. రహానే నిన్న అలా అన్నాడో లేదో.. ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. సిక్స్‌లు, ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also read:
Live Ind vs Eng: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 150 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్..