Trolls on Virat Kohli: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ఎఫెక్ట్.. కోహ్లీని ట్రోల్ చేస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు..
Virat Kohli Duck Out: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్..
Virat Kohli Duck Out: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ ఐదు బంతులాడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతను పెవిలియన్‌కు చేరాడు. అయితే, ఇప్పటికే విరాట్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. తాజాగా డకౌట్ అవడంతో క్రికెట్ అభిమానులు ఉసూరుమంటున్నారు. భారత అభిమానుల సంగతేమో గానీ.. టీమిండియా సారథి కోహ్లీపై ఇంగ్లీష్ క్రికెట్ అభిమానులు మాత్రం సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీని తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అయితే, ఆ సమయంలో కోహ్లీ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. వికెట్ కీపర్ స్టంపౌట్‌కు ప్రయత్నించాడేమో అని భావించాడు. ఆ కారణంగానే రివ్యూ కోరాడు. అయితే, డకౌట్ అయిన సందర్భంగా విరాట్ కోహ్లీ మొహంలో విచిత్రమైన హావభావాలు కనిపించాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఆధారంగా ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల గ్రూప్ బర్మీ ఆర్మీ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తోంది. విరాట్ కోహ్లీ మొహంలోని హావభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేసిన బర్మీ ఆర్మీ.. ‘చాయ్ చేయడానికి వంట గదిలోకి వెళ్లాను. కానీ, ఫ్రిజ్‌లో పాలు లేవని గ్రహించి వెనుదిరిగాను’ అంటూ సెటైరికల్ క్యాప్షన్‌ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.
Barmy Army Tweet:
Going to the kitchen to make a cuppa but realising there’s no milk in the fridge #INDvsENG pic.twitter.com/HiH7gKa6rB
— England’s Barmy Army (@TheBarmyArmy) February 13, 2021
Also read:
India Vs England: రోహిత్ శర్మ, రహనేల అద్భుత పోరాటం.. పటిష్ట స్థితిలో భారత్.. స్కోర్ల వివరాలివే..