India vs England: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్.. రిషబ్ పంత్, బెన్ స్టోక్స్ మధ్య వాగ్వాదం.. అసలేమైంది..?
India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం నాడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది.
India vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం నాడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ ప్లేయర్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఏముందంటే.. ఇంగ్లండ్ ఫీల్డర్లు, టీమిండియా ప్లేయర్ పంత్ మధ్య ఏదో వాగ్వాదం జరిగింది. దాంతో వారిపట్ల విసుగెత్తిన పంత్.. అంపైర్‌కు ఫిర్యాదు వెళ్లాడు. అయితే, ఆ సందర్భంలోనూ పంత్, స్టోక్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. అది గమనించిన అంపైర్లు.. వారిని చేరుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అయితే, పంత్, స్టోక్స్ మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం బయటకు రాలేదు.
Also read:
PF Account : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లే.. ఎలాగో తెలుసా..