PF Account : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లే.. ఎలాగో తెలుసా..

PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్

PF Account : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లే.. ఎలాగో తెలుసా..
Follow us

|

Updated on: Feb 12, 2021 | 9:12 PM

PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌కు అర్హులు. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు ఈడీఎల్ఐ స్కీమ్‌కు అర్హత సాధించినట్టైతే. అసలేంటీ ఈడీఎల్ఐ స్కీమ్? ఈ స్కీమ్ గురించి తెలిసినవారు తక్కువే. ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ. ఎక్కువ మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉచితంగా బీమా పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది.

ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సర్వీసులో చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాలి.

Chanda Kochhar: మనీలాండరింగ్‌ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓకు ఊరట.. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?