Chanda Kochhar: మనీలాండరింగ్‌ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓకు ఊరట.. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి..

Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్‌ రుణా కుంభకోణం

Chanda Kochhar: మనీలాండరింగ్‌ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓకు ఊరట.. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 6:02 PM

Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్‌ రుణా కుంభకోణం కేసులో ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు చందా కొచర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్‌,ఆమె భర్త దీపక్‌, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా ఐసీఐసీఐ స్కాంలో ‍ చందా కొచర్‌ వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్‌ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్‌ దంపతులను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

చందా కొచ్చరే చెప్పారు… అందుకే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశా… వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్…

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు