చందా కొచ్చరే చెప్పారు… అందుకే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశా… వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్…

 చందా కొచ్చర్ చెప్పారనే పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టానని వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు తెలిపారు.

చందా కొచ్చరే చెప్పారు... అందుకే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశా... వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 08, 2020 | 8:17 PM

Chanda Kochhar Told Dhoot To Invest In Hubby’s Company   చందా కొచ్చర్ చెప్పారనే పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టానని వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని ఈడీ సైతం తాజాగా దాఖలు చేసిన  ఛార్జీషీట్‌‌లో పేర్కొంది.

విస్తుపోయే నిజాలు…

వీడియోకాన్ చైర్మన్ దూత్ పెట్టుబడి పెట్టిన క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా చందా కొచ్చర్ ఆఫీసు బాయ్ శరద్ అని ఛార్జీషీట్‌లో పేర్కొంది. శరద్ చందా తండ్రిని చూసుకునే వాడని, కారు డ్రైవర్‌గా పని చేసేవాడని తెలిపింది. అతడికి కనీస అవగాహన లేకుండానే కంపెనీ, పెట్టుబడులు, లావాదేవీలు జరిగేవని ఈడీ ఛార్జీషీటులో స్పష్టం చేసింది.

నేపథ్యం ఇదే…

వీడియో కాన్‌ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులపై ఆరోపణలొచ్చాయి. ఆ గ్రూప్‌ చైర్మన్ వేణుగోపాల్‌ దూత్‌ ఐసీఐసీఐ లో లోన్ పొందేందుకు బదులుగా చందా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగాన్నిఈడీ నిరూపించింది.

వీడియో కాన్ సంస్థకు ఐసీఐసీఐ దాదాపు వేరువేరు బ్రాంచీల నుంచి వివిధ లోన్ల రూపంలో 5,393 కోట్ల రుణాలను అందించింది. ప్రతిగా చందా భర్త కంపెనీలో దూత్ దాదాపు 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. దీంతో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ చందా కొచ్చర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అవకతవకల కారణంగానే ఐసీఐసీఐ బ్యాంకు చందాకొచ్చర్‌ను సీఈవో పదవి నుంచి కూడా తప్పించింది. కాగా, రుణాలు మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఆమె భర్త , వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ గతంలో అరెస్టయ్యారు. చందా కొచ్చర్ ను సైతం ఈడీ అదుపులోకి తీసుకొని పలుసార్లు విచారించింది.