ECIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఈసీఐఎల్ .. ఎటువంటి పరీక్షలు లేకుండానే ఇంటర్వ్యూ.. అర్హతలేమిటంటే

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీఐఎల్. దేశంలోనే ప్రసిద్ధి పొందిన సంస్థ.. ఈసీఐఎల్ లో వరసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ సంస్థ 650 ఇంజనీర్ ఉగ్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈవీఎం...

ECIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఈసీఐఎల్ .. ఎటువంటి పరీక్షలు లేకుండానే ఇంటర్వ్యూ.. అర్హతలేమిటంటే
Follow us

|

Updated on: Feb 12, 2021 | 10:11 PM

ECIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీఐఎల్. దేశంలోనే ప్రసిద్ధి పొందిన సంస్థ.. ఈసీఐఎల్ లో వరసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ సంస్థ 650 ఇంజనీర్ ఉగ్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈవీఎం, వీవీపాట్లకు సంబంధించిన సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్లను పంపించాలి.

అర్హతలు :

ఫస్ట్ క్లాస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇతర అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడు రోజుల్లోపు ఈసీఐఎల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 2 గంటలలోపు ఆన్లైన్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ కాపీని తీసుకోవాలి. అభ్యర్థుల బీటెక్ మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Also Read:

ఆపిల్ తొలి కంప్యూటర్ ఎంత ధరకు అమ్ముడు పోనుందో తెలుసా..? అక్షరాల రూ.11 కోట్లకుపైమాటే.. ఇంతకీ అంతలా ఏముందనేగా..

అన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారికి సరిపోయే విధంగా కృత్రిమ రక్తాన్ని సృష్టించిన మానవ మేథస్సు