రసాయన ఉత్పత్తి కేంద్రం ప్రభావం, రష్యాలో లేత నీలిరంగు కుక్కలు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోన్న ఫొటోలు
రష్యాలో రంగురంగుల కుక్కలు సందడి చేస్తున్నాయి. లేత నీలిరంగులో కుక్కలు దట్టమైన మంచు ప్రాంతాల్లో దర్శనమిస్తూ ఆకర్షిస్తున్నాయి...
రష్యాలో రంగురంగుల కుక్కలు సందడి చేస్తున్నాయి. లేత నీలిరంగులో కుక్కలు దట్టమైన మంచు ప్రాంతాల్లో దర్శనమిస్తూ ఆకర్షిస్తున్నాయి. ఈ వెరైటీ రంగుగల కుక్కల ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారుతున్నాయి. అయితే, కుక్కలకు ఈ రంగు రావడానికి కారణం రసాయన వ్యర్థాలే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రష్యాలోని నిజ్నీ నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ఈ నీలిరంగు కుక్కలు తారసపడుతున్నాయి. రాగి సల్ఫేట్ వంటి రసాయన వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు.
ఒకప్పుడు హైడ్రోసియానిక్ ఆమ్లం, ప్లెక్సిగ్లాస్ తయారుచేసే పెద్ద రసాయన ఉత్పత్తి కేంద్రం ఈ ప్రాంతంలో ఉండేదని దాని ప్రభావం వల్లే కుక్కలకు ఈ వింత రంగులు వస్తున్నాయని ఆండ్రీ మిస్లివెట్స్ అనే స్థానికుడు చెబుతున్నారు. నగరంలోని అధికారులు కుక్కలపై వైద్య పరీక్షలు చేయాలని అక్కడివాళ్లు కోరుతున్నారు. ఇలాఉండగా, 2017వ సంవత్సరం ముంబైలో ఇలాంటిదే జరిగింది. నవీ ముంబైలోని తలోజా ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో నీలిరంగు కుక్కలు దర్శనమిచ్చాయి.
Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశీయ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు ఎంత పెరిగిందంటే..