మెగా ఫ్యాన్స్‌కే కాదు, సౌతిండియా మూవీ లవర్స్‌కు పెద్ద గుడ్ న్యూస్. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రాంచరణ్

మెగా ఫ్యాన్స్‌కే కాదు, యావత్ సౌతిండియా సినిమా లవర్స్ కు ఇది పెద్ద గుడ్ న్యూస్. భారతీయ చలనచిత్ర రంగంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో..

మెగా ఫ్యాన్స్‌కే కాదు, సౌతిండియా మూవీ లవర్స్‌కు పెద్ద గుడ్ న్యూస్. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రాంచరణ్
Venkata Narayana

|

Feb 12, 2021 | 6:16 PM

మెగా ఫ్యాన్స్‌కే కాదు, యావత్ సౌతిండియా సినిమా లవర్స్ కు ఇది పెద్ద గుడ్ న్యూస్. భారతీయ చలనచిత్ర రంగంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ భారీ సినిమాని తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు ఇది 50వ సినిమా కాబోతుండటం విశేషం. ఇక మెగా హీరో రాంచరణ్ కు ఇది 15వ సినిమా. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ స్వయంగా రాంచరణ్ కొంచెం సేపటి క్రితం ప్రకటించారు. “రాజు గారు, శిరీష్ గారు నిర్మిస్తోన్న శంకర్ సర్ సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నానంటూ చరణ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.

కాగా, టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్ రాజుకి, శంకర్ డైరెక్షన్‌లో ఇండియన్ -2 సినిమా నిర్మించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిన సంగతి తెలిసిందే. ఇండియన్-2 సినిమా నిర్మించే అవకాశాన్ని దిల్ రాజు వదిలేసుకున్న తర్వాత లైకా ప్రొడక్షన్స్ ఆ చిత్రాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికే చెర్రీ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘RRR’ షూటింగ్ చివరిదశకు చేరింది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రాంచరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే, ఈ రెండిటిలో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందనేది రేపో మాపో తేలిపోనుంది.

Also read : వచ్చేది మా ప్రభుత్వమే..! ఐజీకి బండి సంజయ్‌ వార్నింగ్, పేద గిరిజనులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని మండిపాటు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu