వచ్చేది మా ప్రభుత్వమే..! ఐజీకి బండి సంజయ్‌ వార్నింగ్, పేద గిరిజనులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని మండిపాటు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో 40 మంది పేద గిరిజనులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టారని..

వచ్చేది మా ప్రభుత్వమే..! ఐజీకి బండి సంజయ్‌ వార్నింగ్, పేద గిరిజనులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని మండిపాటు
Follow us

|

Updated on: Feb 12, 2021 | 5:23 PM

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో 40 మంది పేద గిరిజనులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ రిమాండ్‌ విధిస్తున్నారని సంజయ్ మండి పడ్డారు. ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఐజీని హెచ్చరించారు బండి సంజయ్‌.

కాగా, గుర్రంపోడు తండాలో జరిగిన బీజేపీ గిరిజన భరోసా యాత్ర లో భాగంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన గోడవలలో కార్యకర్తల అరెస్టులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి సహా 21 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా బీజేపీ రాష్ట్రనేతలు, గిరిజనులపై నాన్ బెయిలబుల్ (NB) కేసులు నమోదయ్యాయి.

IPC సెక్షన్ 143, 144, 147, 148, 332, 333 r/w 149 క్రింద మరిము క్రిమినల్ లా అమెండమెంట్ యాక్ట్ 1932 సెక్షన్ 7(1)(a) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. హైద్రాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్, ఫొటోలు ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.

Read also : తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం, మార్చి 14న ఎన్నికలు