Barack Obama వేలానికి బరాక్ ఒబామా షూస్‌.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Shoes Auction: బరాక్ ఒబామా.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అగ్రరాజ్యం అమెరికాను రెండుసార్లు ఏలిన తొలి నల్లజాతీయుడు.

Barack Obama వేలానికి బరాక్ ఒబామా షూస్‌.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 12, 2021 | 5:36 PM

Shoes Auction: బరాక్ ఒబామా.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అగ్రరాజ్యం అమెరికాను రెండుసార్లు ఏలిన తొలి నల్లజాతీయుడు. ఆదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడమే కాకండా ప్రపంచ దేశాల్లోనూ తన ప్రాబల్యాన్ని చాటుడుకున్న అగ్రరాజ్య నాయకుడు బరాక్ ఒబామా. అధికారం నుంచి దిగిపోయి ఒక టర్మ్ ముగిసిపోయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఆయనపట్ల ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. ఆయనకు మాత్రమే కాదు.. ఆయన వాడిన వస్తువులకు, ధరించిన దుస్తులకూ ఓ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వాడిన షూస్‌ని వేలం వేశారు. ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ(NIKE).. ఒబామా ‘షూస్’ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర 25వేల డాలర్లుగా నిర్ణయించింది. ఇది భారత కరెన్సీలో రూ. 18,21,575. తెల్లరంగులో ఉన్న ఈ బూట్లంటే ఒబామాకు చాలా ఇష్టమట. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉంది.

కాగా, తాజాగా వేలానికి పెట్టిన షూలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, జవనరి 20 నుంచి 2017, జనవరి 20 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఒబామాకు రాజకీయాలతో పాటు.. క్రీడల పట్ల కూడా అమితమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా బాస్కెట్ బాల్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే నైకీ సంస్థ ఆయనకోసం ప్రత్యేకంగా షూస్‌ని తయారు చేసిచ్చింది. ఫ్లై వేర్ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ షూస్‌ని 2009లో ఒబామాకు నైకీ సంస్థ అందజేసింది. ఈ షూస్‌ అంటే ఒబామాకు చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు.. ఆయన బయటికి వెళ్తే ఎక్కువగా ఈ షూస్‌నే వాడేవారట. అందుకే ఈ షూస్‌కి అంత క్రేజ్. మరి ఈ షూస్‌ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.

Sotheby’s Tweet:

Also read:

Corona Effect: కరోనా గట్టి దెబ్బే కొట్టింది… గడియారం చూసి సమయం కూడా చెప్పలేకపోతున్నారట.. సంచలన విషయాలు చెప్పిన సర్వే..

Delhi Metro: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఢిల్లీ మెట్రో స్టేషన్… ఏకంగా 47 ఎస్కలేటర్లతో..