TikTok Star: ఇన్‌స్టాగ్రమ్‌లో వీడియో పోస్ట్.. ఆ వెంటనే ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ టిక్ టాక్ స్టార్..
TikTok Star Dies: ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతీ చిన్న అంశానికి సైతం.
TikTok Star Dies: ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతీ చిన్న అంశానికి సైతం ఆత్మహత్యనే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. చివరికి తనువు చాలిస్తున్నారు. ఈ జాబితాలో.. సామాన్యులు మొదలు ప్రముఖల వరకు ఉన్నారు. తాజాగా లూసియానాకు చెందిన ప్రముఖ టిక్ టాక్ స్టార్ దజారియా క్వింట్ నోయేస్ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యక్తిగత కారణాల వల్లే తను చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. 18 ఏళ్ల దజారియాకు టిక్ టాక్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ తో పాటు ఇతర అంశాలకు సంబంధించి వీడియోలను టిక్ టాక్‌లో షేర్ చేసే దజారియా.. భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. టిక్ టాక్‌లో ఆమెకు దాదాపు 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే దజారియా క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, దజారియాను ఫాలోవర్స్ ‘డీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఒక్క టీక్ టాక్ లోనే కాదు.. ఇన్‌స్టాగ్రమ్, యూట్యూబ్‌లోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే దజారియా ఇటీవల తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇదే నా చివరి వీడియో అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ క్యాప్షన్ చూసి ఆమె ఫాలోవర్స్ అంతా షాక్ అయ్యారు. ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ ఆ వీడియో పోస్టు చేసిన మరుసటి రోజే దజారియా ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్త విన్న అభిమానులు నిర్ఘాంతపోయారు. ఎందుకు ఇలా చేసిందంటూ సంతాపం తెలుపుతున్నారు. కాగా, దజారియా ఆత్మహత్యను ఆమె తల్లిదండ్రులు కూడా ధృవీకరించారు. అయితే, దజారియా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం బయటకు రాలేదు.
Also read: