Artificial Blood For Humans: అన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారికి సరిపోయే విధంగా కృత్రిమ రక్తాన్ని సృష్టించిన మానవ మేథస్సు

మనిషి రక్తం చూడడానికి ఎరుపురంగే.. కానీ రక్తంలో అనేక గ్రూప్ లుంటాయి. ఆ గ్రూప్స్ బట్టే అవసరమైన వారికి రక్తం ఇవ్వాలి లేదా స్వీకరించాలి.. అయితే ఒకొక్కసారి అత్యవసర పరిస్థితిల్లో అనుకున్న సమయానికి రక్తం ఎక్కించాల్సి ఉన్నా.. వారికీ సేమ్ బ్లడ్ దొరకడం కష్టమవుతుంది. అటువంటి సమయంలో...

Artificial Blood For Humans: అన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారికి సరిపోయే విధంగా కృత్రిమ రక్తాన్ని సృష్టించిన మానవ మేథస్సు
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2021 | 5:10 PM

Artificial Blood For Humans: మనిషి రక్తం చూడడానికి ఎరుపురంగే.. కానీ రక్తంలో అనేక గ్రూప్ లుంటాయి. ఆ గ్రూప్స్ బట్టే అవసరమైన వారికి రక్తం ఇవ్వాలి లేదా స్వీకరించాలి.. అయితే ఒకొక్కసారి అత్యవసర పరిస్థితిల్లో అనుకున్న సమయానికి రక్తం ఎక్కించాల్సి ఉన్నా.. వారికీ సేమ్ బ్లడ్ దొరకడం కష్టమవుతుంది. అటువంటి సమయంలో యూనివర్సల్ బ్లడ్ డోనార్ గా పిలవబడే O -ve రక్తాన్ని ఎక్కిస్తారు. అయితే ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు బహు అరుదు.. దీంతో పరిశోధకులు తమ మెదడుకు పదును పెట్టారు.. కృతిమ మేథస్సు.. మనిషిని కనిపెట్టాలని కష్టపడుతున్న మానవ మేథస్సు కృతిమ రక్తం కనుగొనే దిశగా అడుగులు వేసింది. ఈ సమస్యకు చెక్ చెప్పే దిశగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..

జపాన్‌ లోని తొకోరోజవా నగరంలో గల నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌ లో అధునాతన పద్దతులతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఈ కృతిమ రక్తంలో కూడా సహజమైన బ్లడ్ లో ఉన్నట్లుగానే ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలు అలాగే రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉంటాయట. ఈ పరిశోదన కోసం వారు రక్తహీనత కలిగిన 10 కుందేళ్లను తీసుకుని ఈ రక్తాన్ని వాటికి ఎక్కించారు. ఈ పరిశోదన జరిపిన కుందేళ్లల్లో ఆరు కుందేళ్ళు జీవించి ఉన్నాయి.. మరో నాలుగు మృతి చెందాయి.

దీంతో ఈ కృత్రిమ రక్తం కుందేళ్ళ ప్రాణాన్ని ఎలా నిలిపిందో.. అదే విధంగా మనుషుల ప్రాణం కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ కృత్రిమ రక్తం అన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికి సరిపోతుందన్నారు. అంతేకాదు ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం ఏకంగా ఓ ఏడాదిపాటు నిలువ ఉంటుందట. అలాగే ఈ రక్తాన్ని కుందేళ్లకు ఎక్కించిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ వాటిల్లో ఎలాంటి సైట్ ఎఫెక్ట్‌లు కనిపించలేదని శాస్త్రవేత్తలు .. కనుక ఈ కృత్రిమ రక్తం మనిషికి అన్ని విధాలా సేఫ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందంటే..?

ప్రశ్నార్థకంగా ‘కూ’ యూజర్ల వ్యక్తిగత వివరాలు..? ఫ్రెంచ్‌ సెక్యూరిటీ పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?