KOO APP: ప్రశ్నార్థకంగా ‘కూ’ యూజర్ల వ్యక్తిగత వివరాలు..? ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు..
KOO APP Exposing Users’ Personal Data: ఇటీవలి కాలంలో ట్విట్టర్‌పై అభియోగాలు పెరుగుతోన్న నేపథ్యంలో దేశీయంగా రూపొందిన మెక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'క్యూ' వైపు యూజర్లు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు సెలబిట్రీలు సైతం..
KOO APP Exposing Users’ Personal Data: ఇటీవలి కాలంలో ట్విట్టర్‌పై అభియోగాలు పెరుగుతోన్న నేపథ్యంలో దేశీయంగా రూపొందిన మెక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘క్యూ’ వైపు యూజర్లు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు సెలబిట్రీలు సైతం ఈ సోషల్ సైట్‌ను వినియోగిస్తుండడంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఫ్రెంచ్ దేశానికి చెందిన రాబర్ట్ బాప్టిస్ట్ అనే సెక్యూరిటీ రీసెర్చర్ ‘క్యూ’ సైట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్యూ’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్ వేదికగా లీక్ అవుతున్నాయనేది రాబర్ట్ ప్రధాన ఆరోపణ. ఇది కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఏకంగా సాక్ష్యలతో సహా ప్రపంచం ముందుపెట్టాడు. ట్విట్టర్ యూజర్ల నుంచి వస్తోన్న అభ్యర్థనల మేరకు రాబర్ట్ ‘కూ’ పరిశోధన జరిపిన తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలైన ఈమెయిల్ అడ్రస్, పేర్లు, జండర్‌లతో మరిన్ని వివరాలను బహిర్గతం చేస్తోందని రాబర్ట్ తెలిపారు. ఇందులో భాగంగానే ‘క్యూ’పై పలు వరుస ట్వీట్లు చేశారు. మరి ఈ డేటా వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. ఇటీవల రైతు నిరసనల నేపథ్యంలో కొందరి ఖాతాలను బ్లాక్ చేయమని చెప్పిన భారత ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ బేకాతరు చేయడంతో.. ‘కూ’ యాప్‌కు ఆదరణ పెరగడం మొదలైంది. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వ అధికారులు ఈ యాప్‌ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ఇందులో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా ఉండడం గమనార్హం. పియూష్ ట్విట్టర్ వేదికగా ‘కూ’యాప్‌ను ఉపయోగించండని ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతేడాది ‘కూ’ యాప్.. డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేటివ్ అవార్డును కూడా గెలుచుకుంది. గతేడాది మార్చిలో ప్రారంభమైన ఈ యాప్‌ను అప్రమేయ రాధాకృష్ణ దేశీయంగా రూపొందించారు.
You asked so I did it. I spent 30 min on this new Koo app. The app is leaking of the personal data of his users: email, dob, name, marital status, gender, … https://t.co/87Et18MrOg pic.twitter.com/qzrXeFBW0L
— Elliot Alderson (@fs0c131y) February 10, 2021
Also Read: Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు