Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
Maharashtra extends travel restrictions: దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల నుంచి..
Maharashtra extends travel restrictions: దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వచ్చే విమాన ప్రయాణికులు గత 72 గంటలకు ముందు కరోనా రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వస్తేనే రాష్ట్రంలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. లేకపోతే వారి ఖర్చులతోనే విమానాశ్రయంలో పరీక్షలు చేయనున్నారు. కాగా.. కేరళతోపాటు.. గుజరాత్, గోవా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులపై కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది.
అలాగే మహారాష్ట్రకు వచ్చే రైలు ప్రయాణికులు కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అని రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రిపోర్టు లేకుంటే రైల్వే స్టేషన్లలో థర్మల్ తనిఖీలు చేస్తారు. ఒకవేళ కరోనా లక్షణాలుంటే వారికి పరీక్షలు చేయనున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ అని తేలితే వారిని కొవిడ్ కేంద్రాలకు తరలించి వారి ఖర్చుతోనే చికిత్స అందించనున్నారు.
కాగా.. మహారాష్ట్రలో గత కొన్ని రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కరోనా మరలా ప్రబలకుండా నివారించేందుకు మహారాష్ట్ర సర్కారు ఈ ఆంక్షలు అమలు చేస్తుందని అధికారులు వెల్లడించారు.
Also Read: