Kangana Using Koo APP: ‘ట్విట్టర్‌’పై సంచలన ట్వీట్ చేసిన బాలీవుడ్‌ క్వీన్‌.. నీ టైమ్‌ అయిపోయిందంటూ పంచ్‌..

Kangana Ranaut Enter Into Koo APP: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ట్విట్టర్‌కు ఇటీవల భారత్‌లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ యాప్‌లు వస్తుండడం వాటిని భారతదేశానికి చెందిన ప్రముఖులు మద్ధతు పలుకుతుండడంతో..

Kangana Using Koo APP: 'ట్విట్టర్‌'పై సంచలన ట్వీట్ చేసిన బాలీవుడ్‌ క్వీన్‌.. నీ టైమ్‌ అయిపోయిందంటూ పంచ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2021 | 3:25 PM

Kangana Ranaut Enter Into Koo APP: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ట్విట్టర్‌కు ఇటీవల భారత్‌లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ యాప్‌లు వస్తుండడం వాటిని భారతదేశానికి చెందిన ప్రముఖులు మద్ధతు పలుకుతుండడంతో ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆదారణ పెరుగుతోన్న యాప్‌లలో ‘కూ’ మొదటి వరుసలో ఉంటోంది. దేశీయంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ‘కూ’లో చేరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ట్విట్టర్‌ వ్యవహరిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ‘కూ’యాప్‌కు మద్ధతు పెరుగుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ కూడా ‘కూ’లో చేరింది. అయితే ఈ విషయాన్ని కంగనా.. ట్విట్టర్‌ వేదికగానే తెలపడం కొసమెరుపు. ఈ అంశంపై ట్వీట్‌ చేసిన కంగనా.. ‘ట్విట్టర్‌ ఇకపై నీ టైమ్‌ అయిపోంది. ఇది ‘కూ’యాప్‌కు మారాల్సిన సమయం. నా అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. దేశీయంగా తయారు చేసిన ‘కూ’యాప్‌ను వాడేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’ అంటూ పేర్కొంది. దీంతో కంగనా చేసిన ట్వీట్‌ ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక ఇదిలా ఉంటే ట్విట్టర్‌ ప్రత్యామ్నాయంగా ‘కూ’ వస్తే.. వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’ అనే యాప్‌ రూపొందుతోన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

‘కూ’ యాప్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నట్లు కంగనా చేసిన ట్వీట్‌..

Also Read: KOO APP: ప్రశ్నార్థకంగా ‘కూ’ యూజర్ల వ్యక్తిగత వివరాలు..? ఫ్రెంచ్‌ సెక్యూరిటీ పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?