Credit Card Bill : క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? బిల్లు కరెక్ట్ సమయానికి కడుతున్నారా..? కట్టకపోతే నష్టాలు తెలుసుకుందాం..!

క్రెడిట్ కార్డు లేని వినియోగదారులు లేని ఇల్లు ఇప్పుడు లేదేమో.. షాపింగ్ చేయాలన్నా.. ఏమైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా దేనికైనా ఇప్పుడు డబ్బులకు బదులు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఎవరైనా క్రెడిట్ కార్డు

Credit Card Bill : క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? బిల్లు కరెక్ట్ సమయానికి కడుతున్నారా..? కట్టకపోతే నష్టాలు తెలుసుకుందాం..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2021 | 9:16 PM

Credit Card Bill : క్రెడిట్ కార్డు లేని వినియోగదారులు లేని ఇల్లు ఇప్పుడు లేదేమో.. షాపింగ్ చేయాలన్నా.. ఏమైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా దేనికైనా ఇప్పుడు డబ్బులకు బదులు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఎవరైనా క్రెడిట్ కార్డు వాడుతుంటే.. తప్పక కొన్ని విషయాలను తీసుకోవాలి.. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో… అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్ కట్టడం విషయం లో నిర్లక్ష్యంగా ఉంటె వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..!

క్రెడిట్ కార్డు బిల్లు ఆన్ టైం లో కట్టక పొతే నష్టపోవాల్సి వస్తుంది గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు బిల్లు కచ్చితంగా కడుతూ రావాలి. అలానే క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్‌ టైమ్‌కు కట్టకపోతే చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు.

క్రెడిట్ కార్డు బిల్లుని ఆలస్యం చేస్తే .. అందుకు ఆలస్య రుసుము చెల్లించుకోవాలి. ఇవి మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో కలిసి వస్తాయి. పైగా వడ్డీ భారం కూడా భారీగానే వేస్తారు. 60 రోజులు దాటిన తర్వాత కూడా మీరు బిల్లు కట్టకపోతే మాత్రం వడ్డీ రేటు మరింత అధికమవుతుంది.

అంతేకాదు క్రెడిట్ కార్డు బిల్లు ఇన్ టైం లో కట్టకపోతే ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుందని అధికారులు చెప్పారు. అనేకాదు క్రెడిట్ స్కోర్‌పై ఏడేళ్లు ఎఫెక్ట్ ఉంటుంది. ఆలస్య రుసుము చెల్లిస్తే రివార్డు పాయింట్లు కూడా కోల్పోతారు. అంతేకాదు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా 180 రోజులు దాటితే ఆఅకౌంట్ ను మొండి బకాయి కిందకు పరిగణిస్తారు.

ఇక క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుని సమయానికి లోన్ ఈఎంఐ కట్టకపోతే మీ టాప్ అప్ తీసుకునే ఛాన్స్‌లు తగ్గిపోతాయి. అంతేకాకండా సిబిల్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే క్రెడిట్ కార్డు ఈఎంఐలు, బిల్లు మొత్తాన్ని కరెక్ట్ టైమ్‌కు కడుతూ వస్తే.. మీకు ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్లు వస్తుంటాయి. కనుక క్రెడిట్ కార్డు బిల్లు సరైన సమయానికి కడితే వినియోగదారుడు క్రెడిట్ కార్డులపై ప్రిఅప్రూవ్డ్ లోన్ కూడా పొందవచ్చు.

Also Read:

: టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం

పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని.. సర్వరోగ నివారిణి, ముసలితనం రానివ్వని కరక్కాయ