AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Update : కొత్తగా పెళ్లైందా.. ఈజీగా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే?…

ఇప్పుడు దేశంలో ఆధార్ కార్డు అన్నింటికీ ఆధారం. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీలను అందుకోలేము.. ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకూ అందరికీ ఆధార్ కార్డు ఖచ్చితంగా...

Aadhaar Card Update : కొత్తగా పెళ్లైందా.. ఈజీగా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే?...
Surya Kala
|

Updated on: Feb 07, 2021 | 1:17 PM

Share

Aadhaar Card Update After Marriage: ఇప్పుడు దేశంలో ఆధార్ కార్డు అన్నింటికీ ఆధారం. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీలను అందుకోలేము.. ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకూ అందరికీ ఆధార్ కార్డు ఖచ్చితంగా అవసరం అన్న సంగతి తెలిసిందే.. అయితే మన దేశంలో సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఇంటిపేరు మారుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.. అయితే పేరు మారినా ఆధార్ కార్డు లో పాత పేరు ఉండడంతో చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో ముఖ్యమైన ఈ కార్డు లో పేరు అడ్రస్ ను సులభంగా మార్చుకోవడం ఎలానో చూద్దాం..!

ఈ ఆధార్ కార్డు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందడమే కాదు.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలన్నా ఖచ్చితంగా అవసరమే. దీంతో ఎవరైనా వివాహం తర్వాత ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి తదితర వివరాలను మార్చుకోవాలని భావిస్తే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే సులభమవుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేసి ఈజీగా పేరును మార్చుకోవచ్చు.

పేరుతో పాటు అడ్రస్ కూడా మార్చుకోవాలని భావిస్తే.. విద్యుత్ బిల్లు సహాయంతో అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పులను ఆధార్ కార్డు కు రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ ఉంటె మాత్రమే ఆన్ లైన్ లో మార్చుకోవడానికి సాధ్యమవుతుంది.

ఒకవేళ ఇప్పటికే రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ వాడుకలో లేకపోతే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి మొబైల్ నెంబర్ అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా పేరు, అడ్రస్, పుట్టినతేదీ, జెండర్ వివరాలను మార్చుకునే అవకాశం ఉంది.

Also Read:

వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం వైరస్‌లు.. గంటల వ్యవధిలో గుర్తించే పరికరం అవిష్కరణలో సీఎస్‌ఐఆర్‌

కాలుష్యాన్ని గుర్తించి కంప్యూటర్‌కు మెయిల్‌ పంపించే ఆకుకూర.. ఎమ్‌ఐటీ శాస్ర్తవేత్తల అద్భుత సృష్టి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్