వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం వైరస్‌లు.. గంటల వ్యవధిలో గుర్తించే పరికరం అవిష్కరణలో సీఎస్‌ఐఆర్‌

ఎన్‌501వై అనే కొత్త రకం వైరస్ పలు దేశాల్లో కలవరం సృష్టిస్తోంది. వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ కొత్త రకాన్ని గుర్తించడం సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం వైరస్‌లు.. గంటల వ్యవధిలో గుర్తించే పరికరం అవిష్కరణలో సీఎస్‌ఐఆర్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 6:20 PM

CSIR ‘Feluda’ team develops Covid test method : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్‌-19 నిరోధానికి టీకాలు వేస్తున్న తరుణంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొత్త రకాలు ఉత్పన్నమై, ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌501వై అనే కొత్త రకం వైరస్ పలు దేశాల్లో కలవరం సృష్టిస్తోంది. కొవిడ్‌-19 బాధితులు, అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ల జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ కొత్త రకాన్ని గుర్తించడం సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ మానవ శరీరంలోకి చేరాక దాదాపు 36-48గంటల సమయం పడుతోందంటున్నారు.

వైరస్‌ను గుర్తించేందుకు సమయం పడుతుండటంతో ఇలోపు జరిగాల్సినదంతా జరిగిపోతుంది. దీంతో ఈ ఇబ్బందిని దూరం చేస్తూ.. కరోనా వైరస్‌ రకాలను గంటలోనే గుర్తించే సరికొత్త విధానం సిద్ధమైంది. భారత శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ బృందం.. గత ఏడాది కొవిడ్‌-19 నిర్ధారణకు కాగితం ఆధారిత పరీక్ష ‘ఫెలూదా’ను అభివృద్ధి చేసింది.తాజాగా రూపొందించిన పరీక్షకు ర్యాపిడ్‌ వేరియంట్‌ అసే (రే) అని నామకరణం చేశారు. దిగ్గజ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్‌ రేకు నివాళిగా ఈ పేరు పెట్టారు.

అయితే, ఫెలూదా తరహాలో ‘రే’ పరీక్ష కూడా కాగితం ఆధారంగానే పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ‘కాస్‌-9’ అనే ప్రొటీన్‌ సాయంతో పనిచేస్తుంది. కొత్త రకం వైరస్‌ జన్యుపటంలోని నిర్దష్ట భాగాన్ని ఇది గుర్తించి, దానికి అతక్కుంటుంది. ఒకవేళ ఆ భాగం లేకుంటే వైరల్‌ జన్యుపటానికి అతుక్కోదు. దీనివల్ల ‘నెగిటివ్‌’ ఫలితం వస్తుందని సీఎస్ఐఆర్ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరీక్ష వల్ల కలిగే మరో ప్రయోజనమేంటంటే.. భవిష్యత్‌లో కొత్తగా వచ్చే కరోనా వైరస్‌లనూ గుర్తించగలిగేలా దీన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్‌లో మార్పులు సహజం. అందువల్ల కరోనా వైరస్‌కు సంబంధించి కూడా భవిష్యత్‌లో కొత్తరకాలు పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర రకాలతో పోలిస్తే ఎన్‌501వై చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీన్ని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యమని.. ఇందుకు అనుగుణంగా కొత్త పరికరాన్ని అవిష్కరిస్తున్నట్లు సీఎస్‌ఐఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి… ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు సోనల్ మోదీకి భంగపాటు.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని బీజేపీ..!