Corona: భారత్‌లో 20 కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య.. మొత్తం ఎన్ని ల్యాబ్‌లు ఉన్నాయో తెలుసా..?

India Coronavirus tests: భారత్ కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోని దేశాలన్నీంటిలో అతి తక్కువ సమయంలో 54లక్షల..

Corona: భారత్‌లో 20 కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య.. మొత్తం ఎన్ని ల్యాబ్‌లు ఉన్నాయో తెలుసా..?
India Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 06, 2021 | 6:25 PM

India Coronavirus tests: భారత్ కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోని దేశాలన్నీంటిలో అతి తక్కువ సమయంలో 54లక్షల మందికి టీకా ఇచ్చి ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలోనే కరోనావైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కరోనావైరస్ పరీక్షల సంఖ్య 20 కోట్లు దాటి మళ్లీ రికార్డుల్లోకెక్కింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం టెస్టుల వివరాలను వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 20 కోట్ల టెస్టులు చేయగా.. వాటిలో 7.40లక్షల టెస్టులు గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో ప్రస్తుతం 2,369 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ ల్యాబ్‌లు 1,214 ఉండగా.. ప్రైవేటు ల్యాబ్‌లు 1,155 ఉన్నాయి. టెస్టింగ్ ల్యాబ్‌లు పెరగడం మూలంగా ఇటీవల కాలంలో నిత్యం 10లక్షలకు పైగా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతోపాటు ఒకానొక దశలో రోజువారిగా 15లక్షల టెస్టులు సైతం చేశారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో దేశంలో కరోనా క్యుములేటివ్‌ పాజిటివిటీ రేటు 5.39 శాతానికి చేరింది. కరోనా రికవరీ రేటు 97.19 శాతం ఉండగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో 1.48లక్షల పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Coronavirus India: గత 24 గంటల్లో వందలోపే మరణాలు.. తాజాగా ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..?

Covid vaccine: వృద్ధులకు మార్చిలో కరోనా వ్యాక్సినేషన్.. అవసరమైతే నిధులు పెంచుతాం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!