Covid vaccine: వృద్ధులకు మార్చిలో కరోనా వ్యాక్సినేషన్.. అవసరమైతే నిధులు పెంచుతాం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

Coronavirus Vaccination: దేశంలో 50 ఏళ్లు పైబడిన వారికి కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం....

Covid vaccine: వృద్ధులకు మార్చిలో కరోనా వ్యాక్సినేషన్.. అవసరమైతే నిధులు పెంచుతాం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Follow us

|

Updated on: Feb 06, 2021 | 2:52 PM

Coronavirus Vaccination: దేశంలో 50 ఏళ్లు పైబడిన వారికి కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముగిసిన వెంటనే వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో పలు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో దశ కూడా ప్రారంభమైందని వెల్లడించారు. ఇది పూర్తయిన వెంటనే మార్చిలో మూడో దశ ప్రారంభిస్తామని.. అప్పుడు 50ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇస్తామని తెలిపారు.

ప్రజల ప్రాణాలను కాపాడటానికి వ్యాక్సినేషన్ కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.35,000 కోట్లు కేటాయించినట్లు హర్ష వర్ధన్‌ పేర్కొన్నారు. అవసరమైతే ఈ మొత్తాన్ని కూడా పెంచుతామని ఆయన వెల్లడించారు. కాగా.. కరోనా టీకా కోసం 22 దేశాల నుంచి భారత్‌కు అభ్యర్థనలు అందాయని హర్ష వర్ధన్‌ తెలిపారు. వీటిలో గ్రాంట్ సహయంతోపాటు కాంట్రాక్ట్‌ కింద ఇప్పటికే 15 దేశాలకు వ్యాక్సినేషన్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. 56 లక్షల టీకా డోసులు గ్రాంట్ సహాయంగా, 105 లక్షల డోసులు కాంట్రాక్ట్‌ కింద పలు దేశాలకు సరఫరా చేసినట్లు ఆయన వివరించారు.

Also Read:

Aadhaar Co-Win App : కో-విన్‌కు ఆధార్‌ తప్పనిసరి కాదు: లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి

Covid-19: భారత్‌లో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారంటే… ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి..