Covid-19: భారత్‌లో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారంటే… ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి..

Covid-19 Vaccination In India: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో మొదలైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియలో కాస్త వేగం పెరగుతోంది. ఇదిలా ఉంటే..

Covid-19: భారత్‌లో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారంటే... ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 5:41 AM

Covid Vaccination In India: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో మొదలైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియలో కాస్త వేగం పెరగుతోంది. ఇదిలా ఉంటే కొందరు వ్యాక్సినేషన్‌ చేసుకోవడానికి సందేహిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ తీసుకుంటూ సామాన్యుల్లో భయాన్ని పొగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పవరకు భారత్‌లో సుమారు 50 లక్షల మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 50 లక్షల మందికి టీకా అందడం విశేషం. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో భారత్‌ మొదటి వరుసలో ఉందని కేంద్రం తెలిపింది. జులై నెల నాటికి దేశంలో 30కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంగా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రపంచం విషయానికొస్తే.. 67 దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికి అత్యవసర వినియోగం కింద మొత్తం 7 వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు, నిత్యం దాదాపు 45 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

Also Read: Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..