దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల కోసం 22 దేశాల నుంచి అభ్యర్ధనలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన
దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల కోసం 22 దేశాల నుంచి అభ్యర్ధనలు వచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. పలు దేశాలతో జరిగిన ఒప్పందాల మేరకు 105 లక్షల..
దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల కోసం 22 దేశాల నుంచి అభ్యర్ధనలు వచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. పలు దేశాలతో జరిగిన ఒప్పందాల మేరకు 105 లక్షల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 52 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఇలాఉంటే, రెండు కోవిడ్ వ్యాక్సిన్‌ల వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1.65 డోసులను సమీకరించామంది. ఇందుకోసం 350 కోట్లను ఖర్చు చేశామని తెలిపిన కేంద్రం.. నిపుణుల కమిటీ సూచనల మేరకు వ్యాక్సినేషన్ జరుగుతోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోమర్ అగ్ని తెలిపారు. ఆసుపత్రి పాలైన వారిలో 27 మంది ఉన్నారన్నారు. తాజాగా ఆగ్రాకు చెందిన ఓ వృద్దుడు చనిపోగా అతనికి డయాబెటీస్ ఉందన్నారు.
18నెలల తర్వాత ఉపశమనం, జమ్ముకశ్మీర్‌లో అందుబాటులోకి 4జీ ఇంటర్నెట్ సేవలు